Home > World News > International > అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

అడవిలో కార్చిచ్చు.. 43 మంది సజీవ దహనం

పాప్ సింగర్ కార్లా బ్రూనీతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్?
కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత

fire accident_apduniaపోర్చుగల్‌లోని ఓ అడవిలో రగిలిన కార్చిచ్చు దావానలంలా వ్యాపించి రోడ్డు పక్కనే ఉన్న కార్లకు అంటుకుంది. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కారులో కూర్చున్న వాళ్లు కూర్చున్నట్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 160 అగ్నిమాపక యంత్రాలతో 500 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లో ఇంతటి ప్రమాదాన్ని చూడలేదని ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సివిల్‌ ప్రొటెక్షన్‌ ప్రధాన కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంటల కారణంగా వచ్చిన పొగ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది కారులోనే మంటలు అంటుకుని చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నష్టం వివరాలు ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *