Home > Crime > అమరనాథ్ యాత్రలో మరో విషాదం : బస్సు లోయలో పడి 16 మంది యాత్రికులు మృతి

అమరనాథ్ యాత్రలో మరో విషాదం : బస్సు లోయలో పడి 16 మంది యాత్రికులు మృతి

రాజేందర్ రెడ్డిపై కేసు అన్యాయం : జానారెడ్డి
కోదండరామ్ను అరెస్టు చేసిన పోలీసులు

amaranth yatra_apduniaఅమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురు యాత్రికులను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకొంది. అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఒకటి జమ్మూ, కాశ్మీర్‌లోని రాంబాన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి ఒక లోయలో పడిపోవడంతో 16 మంది యాత్రికులు మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 19 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్లో జమ్మూకు తీసుకు వచ్చారు. మిగతా ఎనిమిది మందిని బనీహాల్‌లోని జిల్లా అస్పత్రిలో చేర్చి చికత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అమరనాథ్ యాత్రికుసలతో వస్తున్న జమ్మూ, కాశ్మీర్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఒకటి రాంబాన్ సమీపంలోని నచ్‌లానా వద్ద జమ్మూ-శ్రీనగర్ హైవేపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ లోతయిన లోయలోకి పడిపోయినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ఎస్‌ఎస్‌పి) మోహన్‌లాల్ చెప్పారు. మృతులంతా కూడా ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, అసోం, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని ఆయన చెప్పారు.మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. జమ్మూనుంచి 3,603 మంది అమర్‌నాథ్ యాత్రికులను బల్తాల్, పహల్‌గాం బేస్ క్యాంప్‌లకు తీసుకు వెళ్తున్న కాన్వాయ్‌లో ఈ బస్సు ఉంది. స్థానికుల సాయంతో పోలీసులు, సైన్యం, సిఆర్‌పిఎఫ్ జవాన్లు హుటాహుటిన సహాయక కార్యక్రమాలను చేపట్టి లోయలోంచి మృతదేహాలను, క్షతగాత్రులను బైటికి తీసుకు వచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *