Home > General > ఆకాశంలో జన్మించాడు…. బంపర్ ఆఫర్ కొట్టాడు

ఆకాశంలో జన్మించాడు…. బంపర్ ఆఫర్ కొట్టాడు

ఇసుక దందా రీస్టాట్
గుర్రపు డెక్కలతో నిండిపోయిన కాల్వలు

air ways_apduniaఆకాశంలో ఎగురుతున్న విమానంలో పుట్టిన పసిబిడ్డ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సౌదీ అరేబియా నుంచి భారతకు వస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 9 డబ్ల్యూ 569 విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊహించని అతిథికి ఆ జెట్ ఎయిర్‌వేస్ సంస్థ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ సంస్థ విమానాలలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించేలా బర్త్‌ డే కానుకను ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో డమ్మమ్‌ నుంచి కోచికి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి అత్యవసర వైద్యసేవలు అవసరమయ్యాయి. దీంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. విమానం అరేబియా సముద్రం గగనతలంపై 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగానే ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఫ్లైట్‌లో ఉన్న కేరళకు చెందిన నర్సు, విమాన సిబ్బంది కలసి సుఖ ప్రసవానికి సహాయపడ్డారు. ఆ తల్లి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత విమానాన్ని కొచ్చికి కాకుండా ముంబైకి మళ్లించి ల్యాండింగ్ చేశారు. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించి, 90 నిమిషాలు ఆలస్యంగా వెళ్లి కొచ్చిలో ఇతర ప్రయాణికులను దించింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఆ అనుకోని అతిథికి జీవితాంతం ఉచితంగా ప్రయాణ టికెట్లు ఇవ్వనున్నామని సంస్థ తెలిపింది. ఆ బిడ్డ ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించినా ఫ్రీ టికెట్ ఇస్తామని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *