Home > Love Life > ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

మూడు రోజులుగా ప్రియుడి కోసం దీక్ష
ప్రేమికుల కోసం నగ్న హోటల్

first night_apduniaఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి. సాధారణంగా పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢమాసంలో కోడలు గర్భందాల్చితే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అంటే ప్రసవకాలం సరిగ్గా వేసవికాలమన్నమాట. వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడలిని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘసందేశం అనేకావ్యాన్ని రచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *