Home > Vanitha > ఈమె ‘ఎత్తు’ ఎంతో తెలుసా?

ఈమె ‘ఎత్తు’ ఎంతో తెలుసా?

వ‌రుడ్ని వైద్యపరీక్షలకు పంపిన వ‌ధువు
పదో తరగతి ఫలితాల్లో టాప్ లేపిన పనిమనిషి..

chase_apduniaఅదేదో సినిమాలో నీ హైటు ఇండియా గేటు అంటూ హీరోయిన్ ఎత్తును వర్ణిస్తాడు హీరో. ఆ పాటను కాస్త అటుఇటుగా చూస్తే నిలబడి ఆకాశాన్ని తాకేలా హైటున్న ఓ అమ్మడు సందడి చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 23 ఏళ్ల చేస్ కెనడీ అనే కాలేజీ స్టూడెంట్ తన పొడుగు కాళ్లతో ప్రపంచ రికార్డు సాధించింది. అప్పుడప్పుడు మోడలింగ్ లో పాల్గొనే ఈ పార్ట్ టైం మోడల్ కాళ్లు ఏకంగా 51 (4అడుగులు) ఇంచుల పొడవున్నాయి. ఈ పొడుగు కాళ్ల సుందరి 6 అడుగుల 5 అంగుల పొడవుంది. హోలీ బర్ట్ అనే మహిళ కాళ్లు 49.5 ఇంచులున్నాయి. చేస్ హైటులో హోలీ బర్ట్ ను దాటి వరల్డ్ రికార్డును సృష్టించింది. పొడుగు కాళ్లతో ఉన్న చేస్ ను చిన్నప్పుడు స్కూల్లో అందరూ ‘లెగ్స్’, ‘జిరాఫీ’ అని ఆటపట్టించేవాళ్లట. ఇప్పుడు బాస్కెట్ బాల్ టీం లీడర్ గా, మోడల్ గా, ప్రపంచంలో పొడుగు కాళ్ల సుందరిగా రికార్డులు సాధించేసరికి.. వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయట. ఈమె ఇంత ‘ఎత్తు’కు ఎదగానికి కారణమేంటో తెలుసా? తల్లిదండ్రులే. చేస్ వంశపారంపర్యంగానే ఎత్తు పెరిగింది. తండ్రి 6 అడుగుల 7 అంగుళాలుంటాడు. తల్లి 5 అడుగుల 11 అంగుళాలు కాగా, అన్నయ్యలు 6.6, 6.7 అడుగులున్నారట. అంత ఎత్తుంటే ఎవరు ప్రేమిస్తారని డౌట్ అక్కర్లేదు.. ఎందుకంటే తనకంటే ఒక అంగుళం తక్కువున్న 6 అడుగుల 4 అడుగుల అబ్బాయితో చేస్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com