Home > Love Life > ఈ డేటింగ్ యాప్ అంటే ఎంతో క్రేజీ

ఈ డేటింగ్ యాప్ అంటే ఎంతో క్రేజీ

వివాహేతర సంబంధాల్లో వారే ఎక్కువట
మూడు రోజులుగా ప్రియుడి కోసం దీక్ష

dating_apduniaగ్లోబల్ డేటింగ్ యాప్ అయిన ‘హ్యాపెన్’ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా కొత్త ఫీచర్లను ఆరంభించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువతీ, యువకులకు ఎంతో క్రేజీగా మారిన ఈ యాప్ కొత్త ఫీచర్లతో మరింత చేరువ కానుంది. ‘క్రష్ టైం’ పేరిట ఆరంభించిన కొత్త ఫీచర్ ప్రస్థుతం పరీక్షల దశలో ఉందని, దీన్ని మరికొన్ని వారాల్లో విడుదల చేస్తామని ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారుడికి నలుగురి ప్రొఫైళ్లను అందించనుంది. యాప్ అందించే నాలుగు ప్రొఫైల్స్ లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మీరు ఇష్టపడే వారి వివరాలు ఈ యాప్ ద్వారా అందనున్నాయి. మొట్టమొదటి డేటింగ్ యాప్ అయిన ‘హాపెన్’ భారతదేశంలో అధికారికంగా ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభించారు. యువత మది దోచిన ఈ డేటింగ్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లోని 50 ప్రధాన నగరాలకు చెందిన 3.3 కోట్ల మంది వినియోగిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *