Home > Politics > ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల కోట్ల పైనే

ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల కోట్ల పైనే

సన్నాఫ్ రాయపాటికి పొలిటికల్‌ ఎంట్రీకి రెడీ
ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ

telangana-apduniaతెలంగాణ వ్యాప్తంగా అక్టోబరు ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది.  దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 2143 మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కొత్త దుకాణాలు అక్టోబరు 1వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 2216 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించి, టెండర్లు పిలిచింది. అందులో మేడ్చల్ జిల్లాలోని ఒక దుకాణానికి దరఖాస్తు రాలేదు. మిగిలిన 2215 దుకాణాలకు దరఖాస్తులు రాగా,   2143 దుకాణాలను ఖరారు చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 2 దుకాణాలకు ఒక్కొక్కటి చొప్పున దర ఖాస్తు రాగా, వాటిని వారికే ఖరారు చేశారు. అయితే  శుక్రవారం జరిగిన లాటరీలో ఈ రెండు దుకాణ దారులకు వేరే చోట దుకాణాలు రావడంతో ఇంతకు ముందు కేటాయించిన దుకాణాలను వారు రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రెండు దుకా ణాలను ఎవరికీ కేటాయించలేదు. ఇదిలా ఉండగా, ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ఏరి యాల్లోని 70 దుకాణాలను ఖరారు చేసినప్పటికీ స్థానిక గ్రామసభల అనుమతి తరువాత వాటిని తెరి చేందుకు అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మిగిలి న 3 దుకాణాలకు త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయిం చారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 41,119 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు దరఖాస్తులన్నింటికీ జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో దుకాణాదారులను ఎంపిక చేశారు. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన ఎక్సైజ్ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని 67 మద్యం దుకాణాలకు దరఖాస్తులు అందలేదు. మూడు పర్యాయాలు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని అలాగే వది లేసారు. ఈ ఏడాది కొత్త పాలసీలో ఎవరూ తీసుకోని మధ్యం దుకాణాలను మరో చోటికి తరలించడంతో వాటికి కూడా దరఖాస్తులు అం దాయి. గత ఎక్సైజ్ పాలసీ కన్నా, ఈ ఎక్సైజ్ పాలసీ ద్వారా ఖజానాకు అదనంగా రూ.6,000 కోట్ల ఆదాయం సమకూరే విధంగా రూపొందించినప్పటికీ, వ్యాపారస్తుల నుంచి భారీ స్పందన వచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *