Home > Crime > ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

ఎట్టకేలకు మనోజ్ పాండే అరెస్ట్

డ్రోన్ కెమేరా వినియోగంపై ఆంక్షలు
మరో వివాదంలో కోలివుడ్ నటుడు

manoj pandey-apduniaనటిపై రేప్ కేసులో మరో నటుడు అరెస్టయ్యాడు. తనతో అనుబంధం కొనసాగిస్తూనే ఇతర మహిళలతో సంబంధం పెట్టుకున్నాడని, తనను మోసగించాడని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. నటుడు మనోజ్‌ పాండే తనపై లైంగిక దాడి జరిపాడని కొన్ని రోజుల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇతడు భోజ్‌పురి భాషలో ప్రముఖ నటుడు. నటి ఫిర్యాదు మేరకు ముంబైలోని చార్‌కోప్‌ పోలీసులు మనోజ్ పాండేపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మనోజ్‌ పాండే కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం అతణ్ని అరెస్టు చేశారు.స్వతహా సింగర్ అయిన బాధిత యువతి మనోజ్ పాండేతో కలిసి పలు సినిమాల్లో నటించింది. స్థానిక బిగ్‌బాస్ షోలో కూడా అతడితో పాటు కలిసి నటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబరుచుకొని ఇప్పుడు మోసం చేశాడని ఆ నటి పోలీసుల వద్ద వాపోయింది.సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే చాలా మంది అమ్మాయిలను మభ్యపెట్టి.. మనోజ్‌ మోసం చేశాడని సదరు యువతి పోలీసులకు మీడియాకు తెలిపింది. పరిశ్రమలో తానో పెద్ద స్టార్‌నని, మంచి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పుకుంటూ.. వారితో స్నేహం పేరిట వల వేస్తాడని ఆమె చెప్పింది. తానూ ఇదేవిధంగా మోస పోయానని ఆమె వాపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com