Home > Movies > ఎన్టీఆర్ తో ఢీ అంటున్న నారావారబ్బాయి

ఎన్టీఆర్ తో ఢీ అంటున్న నారావారబ్బాయి

అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు : సన్నీ లియోన్
మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2

nara rohit-ntr_apduniaప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జూనియర్, ఆ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగా త్రివిక్రమ్, కథా కథనాలు సిద్ధం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నారా రోహిత్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జై లవ కుశ షూటింగ్ తరువాత బిగ్ బాస్ తెలుగు షో షూటింగ్ కోసం కొంత కాలం ముంబైలోనే ఉండనున్నాడు జూనియర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *