Home > Editorial > ఏటా ఐదు వేల మంది పరువు హత్యలకు బలి…

ఏటా ఐదు వేల మంది పరువు హత్యలకు బలి…

చిత్తూరు జిల్లాల్లో మూత పడనున్న 53 స్కూళ్లు
ముల్లును ముల్లుతోనే తీయాలి....

pink ponk_apduniaపరువు హత్యలకు ఎంత మంది బలి అవ్వాలి….? ఎందరికి ఈ అన్యాయం జరగాలి….? పరువు పేరుతో సిగ్గు ఎగ్గు లేకుండా కుల దురహకారమనే అదిమాజాతి లక్షాణాలతో విర్రవిగే కొందరు చేస్తున్నా ఈ దారుణాలకు అంతం ఎప్పుడు…? మొన్న కంచకర్ల కోటేశ్ నిన్న మంథని మధుకుర్, రాజేష్ ఇప్పుడు నరేష్ ప్రభుత్వాలలో చలనం రాదా…?కులల అలోచన తీరులో మార్పచ్చేదేపుడు…?పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు, దానధర్మాలు చేస్తారు. కులగౌరవం వంశప్రతిష్ఠ పెద్దపేరున్న కుటుంబం అంటూ కొన్నిసార్లు చేయకూడని అమానుషమైన పనులు చేస్తారు. తమ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డలకు స్వయానా తామే బలిపీఠాల్ని పేర్చే మానవమృగాల ఘాతుకాన్ని ఆనర్ కిల్లింగ్ అని పిలుస్తున్నారు. అంటే స్వీయ గౌరవ పరిరక్షణ కోసం చంపేయడం. వంశప్రతిష్ఠ అనే ముసుగులోనో, కుటుంబ మర్యాద అనే మిషతోనో, కులగౌరవం అనే సాకుతోనో- ఇలా నెపం ఏదైతేనేం. కిరాతకంగా ఏటా అయిదు వేల మందికి పైగా మహిళల్ని చంపుతున్నారు. కుటుంబ పరువు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమంటూ హత్యలకు పాల్పడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్’తో యువతులు ఊరు విడిచి పారిపోవడం తమ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని, ఇష్టపడిన వ్యక్తితో పెళ్ళికి ముందే సహజీవనం సాగించడంవల్ల కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఆ కళంకాన్ని తుడిచి పెట్టడానికి వారిని చంపుతున్నారు. చంపేయాల్సినంతటి ఘోర నేరాలా అవి? పరువు ప్రతిష్ఠల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం? హంతక కుటుంబంగా మారడం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ట అర్ధం కాని పరిస్థితి..మహిళలు తమ పెద్దలు కుదిర్చిన పెళ్ళి సంబంధాన్ని నిరాకరించడం, తాము మనసు ఇచ్చిన మగవాడితో ఇంట్లోవారికి చెప్పకుండా వెళ్లిపోవడం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం, భర్త నుంచి విడాకులు కోరడం, అత్యాచారానికి గురవడం- అవన్నీ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేవేనట. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురుగా ఇలా ఏ హోదాలో ఉన్నా కుటుంబంలోని మగసభ్యుల నుంచి వారికి ఇప్పటికీ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మగవాళ్ల రక్షణలోనే మహిళలు ఉండాలన్న పితృస్వామిక భావజాలం మగవారిలో పాతుకుపోవడం అందుకు కారణం. తమ చెప్పుచేతల్లో మహిళలు నడుచుకోకపోవడాన్ని కుటుంబప్రతిష్ఠతో ముడిపెడుతూ, దాన్ని కాపాడటం కోసమంటూ మహిళల్ని హతమార్చడం అమానుషం. అత్యంత హేయం.కుటుంబ గౌరవ ప్రతిష్ఠల పేరిట హత్యలకు ఒడిగట్టడం అనాగరికమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది.కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకుల్ని హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. ‘వివాహాలు ఆమోదయోగ్యం కాని పక్షంలో తల్లిదండ్రులు చేయగలిగింది తమ పిల్లలతో సామాజికంగా తెగతెంపులు చేసుకోవడమే. అంతేతప్ప వారిని వేధించడానికి వీలులేదు’ అని స్పష్టం చేసింది. ఇచ్ఛాపూర్వకంగా కులాంతర, లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తుల్ని కుటుంబగౌరవ పరిరక్షణ పేరిట బంధువులు హతమార్చడం- క్రూరత్వానికి, ఫ్యూడల్ మనస్తత్వానికి దృష్టాంతమనీ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు యువతీయువకులు పరువుహత్యలకు గురవుతూ రాజ్యాంగపరమైన జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి.వివాహ వయసు వస్తుండగానే పెళ్లిళ్లు చెయ్యాలి. ఆడపిల్లలు కూడా ఆకర్షణలు, అత్యాశలకు బలికాకుండా స్వీయక్రమశిక్షణ కలిగి ఉండాలి. తమ ఇష్టాయిష్టాలను పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లిళ్లు చేసుకోవడం సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఏ పనిచేసినా ఆచరణాత్మకంగా, ఆలోచించి చెయ్యాలి. పర్యవసానాల గురించి ముందే ఆలోచించడాన్నే కీడించి మేలించడం అంటారు. వ్యవహార జ్ఞానం ఉన్నవాళ్లు తొందరపడరు. ఆవేశంతో ఏ పనీ చెయ్యరు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి, శ్రేయాభిలాషుల్ని సంప్రదించిన తర్వాతనే ఏ పని అయినా చేస్తారు. ప్రేమ అంటే ఆడ-మగ మధ్య అనుబంధం. పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య సంబంధం. కుల, మతాలకు అతీతం. మంచి చెడులకు ఆర్థిక, అంగబలాలు లభిస్తాయి. ప్రేమ పెళ్లిళ్లు పెద్దల అనుమతితో జరిగేలా చూసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరం. పెద్దలు కూడా పిల్లల మనోభావాలను అర్థం చేసుకోవడం అవసరం. అప్పుడు పరువుహత్యలకు ఆస్కారం ఉండదు. నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలతో తమ సంతానాన్నే ద్వేషించే దుర్మార్గానికి కొత్త పేరు పరువు హత్య. ఇందులో పరువు ఏమీ లేదు, హత్య మాత్రం ఉంది. తమ కులాన్ని, వంశాన్ని, ఇష్టాన్ని కాదన్నారన్న ఒకే కారణంతో తమ కూతురిని ఆమెను ప్రేమించిన వ్యక్తిని హత్య చేయడానికి ఆమె కుటుంబం వెనుకాడటం లేదు. ఖాప్‌ పంచాయతీలు కుల సంఘాలు ఈ హత్యలను సమర్థించడం మరీ దారుణం.ఏప్రిల్‌ 2011లో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు మార్కండేయ కట్జూ, జ్ఞాన్‌ సుధా మిశ్రాతో కూడిన ధర్మాసనం పరువు పేరుతో హత్యలను వ్యవస్థీకరించిన ఖాప్‌ పంచాయితీ లను తీవ్రంగా నిరసించింది. ఉత్తర భారతంలో ఖాప్‌ పంచా యితీలు, దక్షిణాన తమిళ నాడులో కట్ట పంచాయితీలు క్రూరమైన ఆదేశాలు ఇవ్వడం చెల్లవని వారిని కఠినంగా శిక్షించాలని ధర్మాసనం పేర్కొన్నది. ఈ ఆదేశాల ఆధారంగా జరిగే పరువు హత్యలను నివారించే బాధ్యత రెవెన్యూ పోలీసు అధికారులకు ఉందని వివరించింది. రిజిస్టర్‌ వివాహపు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇది యువతీ యువకులకు ప్రాణాంతకంగా మారింది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం గుర్తించిన హక్కు. ఈ హక్కును వాడుకున్నందుకు వారి మరో ప్రధానమైన రాజ్యాంగ జీవన హక్కును పూర్తిగా కోల్పోతున్నారు. దీన్ని నివారించే విధానాలు కనిపెట్టాలి. కావలసిన చర్యలు ప్రభుత్వమే తీసుకో వాలి. మత పరమైన వివాహ చట్టాలలో, మతాతీతమైన ప్రత్యేక వివాహ చట్టంలో కూడా యువతీ యువ కుల ప్రాణ రక్షణకు కావలసిన రక్షణలేమీ లేవు. తల్లిదండ్రులకు తమ పిల్లల వివాహ నిర్ణయ సమాచారం తెలుసుకునే హక్కు లేదా అనే ప్రశ్నతోపాటే స్వయంగా వివాహ నిర్ణయం తీసుకుంటే అది చట్ట వ్యతిరేకం కాకపోయినా, తమ ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు, నోటీసు ఇవ్వకూడదనే అంశాన్ని కూడా పరిశీలించాలి. ప్రస్తుత చట్టాల ప్రకారం నోటీసు తప్పని సరి, మొత్తం ప్రపంచానికే నోటీసు ఇవ్వాలి. ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్త వచ్చు అనేది ఇవ్వాళ అమలులో ఉన్న చట్టం. కాని ఎవ్వరూ వివాహ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చి అక్కడ గోడకు వేలాడే నోటీసును చదువుకోవడం జరగదు కనుక రిజిస్టర్‌ వివాహాలు రహస్య వివాహాలైపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *