Home > Latest News > ఏపీలో విద్యార్ధినులకు సైకిళ్లు : మంత్రి గంటా

ఏపీలో విద్యార్ధినులకు సైకిళ్లు : మంత్రి గంటా

ఢిల్లీలో కాలుష్యానికి బోనస్ గా కంపు
పర్యాటక పండగకు మూడు ప్రణాళికలు
ganta_apduniaఏపీలోని అన్నీ జిల్లాలు విశాఖ ని రోల్ మోడల్ గా తీసుకునే విధం గా ఈ విద్య శాఖ భవన్ అభివృద్ది చెయ్యాలని  మంత్రి గంట శ్రీనివాసు రావు అన్నారు. సోమవారం నాడు విశాఖలో అయన విద్యాభవన్ ను ప్రారంభించారు. విశాఖ లో  విద్యాభవన్ ను 6 వేళా గజల్లో 1కోటి 30 లక్షలు తో నిర్మించారన్నారు. ఈ నూతన భవంతి లో విద్యాశాఖ కు సంబంధించి అన్ని శాఖలు ఒకే దగర ఉంటాయన్నారు.  ప్రత్యేకంగా మీటింగ్ హాలు, రానున్న కాలం లో ఇక్కడ ఇంటర్ బోర్డు ఇలా ఇతర విద్య కు సంబంధించిన కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని, ఈ సంక్రాంతి కి  జిల్లా విద్యాశాఖకు నూతన భావనని కానుకా గా ఇస్తున్నామన్నారు. అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు.  రాష్ట్రం లో లోటు బడ్జెట్ వున్నా కూడా 21,500 కోట్లా రూపాయల నిధులు విద్యాశాఖ కు కేటాయించారని తెలిపారు. ముఖ్యం గా రాష్ట్ర విద్యాశాఖ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా కార్యాలయాలకు ఒక ప్రత్యక రంగు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని  ప్రభుత్వ పాఠశాలల్లో వున్న బాలికలకు సైకిళ్లను కానుకగా ఇస్తున్నామని వెల్లడించారు. దీనికిగాను 100 కోట్లా రూపాయలు తో లక్ష డబ్బై ఐదు సైకిళ్ళు కొనుగోలు చేశామని అన్నారు.  ఈ సంక్రాంతి కి బాలికలు కు అందచేస్తామని అన్నారు. మరో 4 ,000 కోట్లా రూపాయల తో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక  సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా తీర్చి దిద్దుతామని తెలిపారు.  ఈ కార్యిక్రమంలో విశాఖజిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *