Home > Politics > ఐక్యపోరాటాలపై హస్తం నేతల దృష్టి

ఐక్యపోరాటాలపై హస్తం నేతల దృష్టి

నాలుగు వేల కోట్ల లోటు పెరిగింది
మరోసారి తెరపైకి మోడీ డిగ్రీ అంశం

congress_apduniaకేంద్ర రాష్ర్ట ప్రబుత్వాలు అవ‌లంబిస్తున్న ప్రజా వ్యతిరేక వైఫల్యాలను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలంటే పార్టీ ముఖ్యు లంతా ఏకతాటిపైకి వచ్చి, ఐక్యంగా ఉన్నామ‌న్న సంకేతాలను పార్టి లోని కింది స్దాయి నేత‌ల‌కు పంపిం చాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ అనుసరిం చాలన్న అంశంపై పీసీసీ ముఖ్యనేతలు చర్చిం చుకుంటున్నారు. పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగేవారు, అధిష్టానానికి దగ్గరగా ఉన్నవారు, ప్రజల్లో ఆదరణ కలిగి నవారు అంతా ఒకవేదికపైకి రావాలని నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ లో నెల‌కొంటున్న పరిస్థితుల‌పై సీనియర్లు, ముఖ్యనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టం సాధించామ‌న్న ధీమా కూడా పార్టి నేత‌ల్లో క‌లుగ‌క పోవ‌డం భాద‌క‌ర‌మ‌ని,అదే సంద‌ర్బంలో అధికార టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఎంత పోరా డినా కాంగ్రెస్‌పార్టీకి అనుకున్నంత ప్రయో జనం దక్కడం లేదని వారు కలత చెందు తున్నారు. ఇటు అసెంబ్లీలో అటు బయటా టీఆర్‌ఎస్‌ సర్కారు తప్పిదాలను ఎప్పటికప్పు డు ఎండగడుతున్నా, కాంగ్రెస్‌పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం ఎందుకు పెరగడం లేదని సీనియర్లు ఈవ్ర ఆవేద‌న చెందుతున్నారు.ప్ర‌దానంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ వాగ్దాటిని బ‌లంగా ఎదురుకోలేక పోతున్నామ‌న్న వాద‌న పెద్ద ఎత్తున విన‌బ‌డుతుంది.. టీఆర్‌ఎస్‌ రెండున్నరేళ్ల పాలన తర్వాత ఆ పార్టీకోసం పనిచేసిన వర్గాల్లోనే కాకుండా, పార్టీ నాయకుల్లోనూ ఎక్కడో తెలియని అసంతృప్తి ఉన్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూనే, ఆ అసంతృప్తిని కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఎందుకు మలచుకోలేకపోతున్నామని ఆ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.రైతులకురుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ,విధ్యార్దుల పీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాల విషయంలో ప్రజలు అసం తృప్తిగా ఉన్నట్టు కాంగ్రెస్‌పార్టీకి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందుతు న్నాయి. రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించగలిగే ఎస్టీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు, కుల సంఘాలకు పలుమార్లు ఇచ్చిన హామీలు, ఉద్యోగ సంఘాలకు చేసిన వాగ్దానాల అమలులో వైఫల్యంతో పాటు విద్యార్థులు, యువకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. విద్యా ర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, కేజీ టు పీజీదాకా ఉచితనిర్బంధ విద్య, ఉద్యోగాల భర్తీ వంటి కీలకమైన అంశాల్లోనూ టీఆర్‌ఎస్‌ వైఫల్యం కంటికి కనిపించేవిధంగానే ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే నూత‌నంగా ఏర్పడిన జిల్లాల‌తో పాటు మొత్తం 31 జిల్లాల‌కు తాత్క‌లికంగా పార్టి అధ్యక్షుల‌ను నియ‌మించిన‌ప్ప‌టికి అవి పూర్తి స్దాయిలో ప‌ని చేయించేలా పార్టి అధిష్టానం దృష్టి సారిస్తే మంచి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న బావ‌న పార్టి నేత‌ల్లో గ‌ట్టిగా నెల‌కొన్నది.దీనికోసం ప్రాథమిక స్థాయిలో కొంత కసరత్తు జరిగినట్టుగా తెలుస్తోంది.అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ ముఖ్యులను సమావేశపర్చాలనే యోచ నలో ఉన్నట్టు ఆ నాయకుడు వెల్లడించా రు. వచ్చే వేసవికాలం నాటికి పటిష్టమైన వ్యూహంతో . పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడం, ఆ తరువాత ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలపై క్షేత్రస్థాయిలో గట్టిగా పోరా డడం వంటి అంశాల‌పై దృష్టి సారించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *