Home > General > కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా

కయ్యానికి కాలు దువ్వుతున్న కొరియా

మార్కెట్లో బాహుబలి శారీస్
ప్రజాపతికి బెయిల్‌ ఇచ్చినందుకు జడ్జి సస్పెండ్
north koria_apduniaఅమెరికా – ఉత్తర కొరియా దేశాల మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు నియంత కిమ్ జాంగ్ ఉన్ మ‌రోసారి మిసైల్ టెస్ట్ నిర్వ‌మించి క‌య్యానికి కాలుదువ్వాడు. అమెరికాతో తాము యుద్ధానికి సిద్ధం అని ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే ఉత్త‌ర కొర‌యా అణుర‌హిత మిస్సైల్‌ను ప్ర‌యోగించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. దీంతో ఆగ్ర‌హానికి గురైన అగ్ర‌రాజ్యం అమెరికా ఆదేశాల‌తో ఎయిర్ క్రాఫ్ట్‌ల‌తో సిద్ధంగా ఉన్న యుద్ధ‌నౌక  ఉత‌్త‌ర కొరియా వైపు దూసుకెళుతోంది.ఉత్త‌ర కొరియా మ‌రోసారి మిసైల్‌ను ప‌రీక్షించి చాలా పెద్ద త‌ప్పు చేసింద‌ని వైట్ హౌజ్ పేర్కొంది. శ‌నివారం తెల్ల‌వారుజామున దక్ష‌ణ ప్యాంగ్యాంగ్ నుంచి మిసైల్‌ను ప్ర‌యోగించిన‌ట్లు అమెరికా అధికారులు వెల్ల‌డించారు. జ‌పాన్ స‌ముద్ర తీర‌మే ల‌క్ష్యంగా ఈ ప్ర‌యోగం జ‌రిగింద‌ని చెప్పిన అమెరికా..ల‌క్ష్యాన్ని చేర‌క‌ముందే పేలిపోయింద‌ని పేర్కొంది. అయితే 44 మైళ్ల ఎత్తులో ఈ మిసైల్ ఎగిరింద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. అయితే  తాము ప్ర‌యోగించిన క్షిప‌ణి విఫ‌ల‌మైన‌ట్లు ఉత్త‌ర కొరియా నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *