Home > Bhakti > కాణిపాకం ప్రసాదంలో మేకు

కాణిపాకం ప్రసాదంలో మేకు

గ్రేటర్ లో బోనాల ముస్తాబు
కల్పవృక్ష వాహనంలో వూరేగిన స్వామివారు

kanipakam laddu_apduniaకాణిపాక వరసిద్ధి వినాయకుడు. స్వయంభువుగా వెలసిన దేవుడు. కాణిపాకం గురించి తెలియని భక్తులుండరంటే అతిశయోక్తి లేదు. ప్రతి రోజు 20 వేల మందికిపైగా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తమిళ భక్తులే ఎక్కువ మంది కాణిపాకంకు వస్తుంటారు. ఈ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రసాదానికి అంతటి ప్రాధాన్యత ఉంది. అలాంటి కాణిపాక ఆలయ లడ్డూలో మేకు (చీల) కనిపించింది. ఒక భక్తబృందం లడ్డు తింటుండగా మేకు కనిపించడంతో ఏం చేయాలో తెలియక అలాగే చేతుల్లో పట్టుకు నిలబడిపోయారు. భక్తులు వెంటనే తేరుకుని దేవస్థానం అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళారు. అయితే దేవస్థానం అధికారులు భక్తులకు సానుకూలంగా సమాధానం చెప్పాల్సింది పోయి వారిపైనే తిరగబడ్డారు. మీకు ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండి అంటూ హుకుం జారీ చేశారు. దీంతో భక్తులు మీడియా ముందు జరిగిన విషయాన్ని తెలిపారు. భక్తులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే లడ్డూలోనే ఇంత పెద్ద మేకు వచ్చిదంటే ఆలయ సిబ్బంది పనితీరు ఏ మాత్రమో అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *