Home > Love Life > కారులో ప్రేమజంట రొమాన్స్‌.. గేరు మారడంతో సరస్సులోకి?

కారులో ప్రేమజంట రొమాన్స్‌.. గేరు మారడంతో సరస్సులోకి?

శృంగార వాంఛతో మొసలిని వాటేసుకున్నాడు.. ఏం జరిగింది?
శృంగార సామర్థ్యం పెంచే 10 వంటింటి ఔషధాలు

lovers1_apduniaప్రేమ జంటలు పార్కులు, బీచ్‌లో ఓవరాక్షన్ చేస్తున్నాయి. అందరి కంట పడేలా రొమాన్స్‌కు పాల్పడుతున్నాయి. తాజాగా కారులోనే రొమాన్సుకు పాల్పడిన ఓ ప్రేమజంట ఊహించని రీతిలో దుర్మరణం చెందారు. ఈ ఘటన రష్యాలోని వోలోగ్రాడ్‌లో చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ఎవిజనీ చెర్నోవ్ (22) పీఈటీగా పని చేస్తున్నాడు. అతని ప్రియురాలు యానా క్ర్యుచ్ కోవా (22)తో కలిసి మంగళవారం విహారయాత్రకు వెళ్లారు. ఈ విహార యాత్రలో భాగంగా వోల్ గ్రాడ్ శివారులోని ఓ సరస్సు గట్టుమీద కారు ఆపి కొంచెం సేపు మాట్లాడుకున్నారు. ఆపై వెనుక సీట్లోకి వెళ్లిన ఈ ప్రేమ జంట రొమాన్స్‌లో మునిగిపోయింది. న్యూట్రల్‌లో ఉన్న కారు గేరు మారడంతో సరస్సులోకి దూసుకెళ్లింది. నీట మునిగిన కారు నుంచి ఆ ప్రేమజంట బయటపడలేకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌యూవీ కారు సరస్సులో మునిగిపోవడం, రక్షించే వారు ఆ ప్రాంతంలో లేకపోవడంతో వీరిద్దరూ నీటిలోనే తుదిశ్వాస విడిచారని పోలీసులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *