Home > General > కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు!

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు!

యాహూ పేరు మార్చుకుంటోంది
సంక్రాంతి నాటికి గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ నెట్
 
cash treoubles_apduniaపెద్దనోట్లను రద్దు చేసి రెండు నెలలు పూర్తయినా జిల్లా ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం 500/1000 నోట్లను రద్దు చేసింది మొదలు జిల్లాలో ప్రారంభమైన చిల్లర కష్టాలు మూడవ నెలలోకి అడుగిడినా సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏలూరు, తాడేపల్లిగూడెం, బీమవరం ప్రాంతాల్లో  సహా అన్ని పట్టణాలు, డివిజన్, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ సుమారు 80 శాతం ఎటిఎంలు అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయి. పరిమితమైన ఎటిఎంలలో నగదు విత్‌డ్రాకు వెళ్తే 2000 నోట్లు మినహా చిల్లర గగన కుసుమంగానే మారింది. అయితే కొత్త 500 నోట్ల రాకతో పరిస్థితిలో కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ ప్రజలకు చిల్లర కష్టాలు మాత్రం తీరలేదు.  చిల్లర కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఆయా వర్గాల ప్రజలు చివరకు పండుగ, పబ్బాలకు దూరమయ్యారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు పేలవంగా జరగడమే ఇందుకు ఉదాహరణ. ఇక ఈ సంక్రాంతి పండుగకు సామాన్యుడి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60శాతం కుటుంబాలు సంక్రాంతి పండుగకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్నీ పూర్తిచేసుకోలేని దుస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏటా మాదిరిగా ఇంటా, బయటా చక్కబెట్టాల్సిన అనేక పనులు పెండింగ్‌లో ఉండిపోగా, పలువురు సంక్రాంతి సంబరాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో నగదు ఉండి కూడా సకాలంలో చేతికందక అగచాట్లు తప్పలేదని, చిత్రమైన ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నామని పలువురు వ్యాఖ్యానించారు. జిల్లాలో వ్యాపార సంస్థల పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంది. ఏ ఒక్క వ్యాపార వర్గానికీ కొత్త సంవత్సర ఆరంభం కలసి రాలేదు. అలాగే వాహనాల కొనుగోళ్ళు, బంగారం, వెండి, వస్తవ్య్రాపార రంగంపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావానే్న చూపింది. మరోవైపు జిల్లాలో నగదు రహిత కార్యకలాపాలను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం వేగవంతం చేస్తోంది. ప్రతివొక్క దుకాణదారుడు విధిగా పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను కలిగివుండేలా ప్రోత్సహిస్తోంది. మొబైల్స్, ఎటి ఎం , డెబిట్/క్రెడిట్ కార్డులు, చెక్‌ల రూపంలో లావాదేవీలను ప్రోత్సహించాల్సిందిగా బ్యాంకర్లకు ప్రభుత్వ యంత్రాంగం పదే పదే సూచిస్తోంది. బ్యాంకర్లు కూడా నగదు రహిత లావాదేవీలపైనే దృష్టి సారించకతప్పలేదు. పెద్దనోట్ల రద్దుతో తాము అనేక కష్టాలు పడుతుంటే, జిల్లాలోని పలువురు బడాబాబులు, ధనికులు మాత్రం ఎప్పటిలాగే హాయిగా తమ పనులు తాము చేసుకుంటున్నారని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *