Home > Editorial > కొనసాగుతున్న మోడీ, షా జైత్రయాత్ర

కొనసాగుతున్న మోడీ, షా జైత్రయాత్ర

మిత్రులే కానీ.. శత్రువులు
అనాధ నుంచి స్విట్జర్లాండ్ ఎంపీ వరకు....

narendramodi-amithsha-apduniaగుజరాత్.. 22 ఏళ్లుగా బీజేపీకి పట్టం కడుతున్న రాష్ట్రం.. ప్రధాని మోదీ సొంతగడ్డ. ఏ గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ సీఎం నుంచి పీఎంగా ప్రమోషన్ పొందారో ఆ రాష్ట్రంలో ఎన్నికలంటే బీజేపీకి ఇక తిరుగుండదు అన్నదే చాలా మంది అభిప్రాయం. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ ధాటిగా తమ ప్రచారాన్ని మొదలుపెట్టింది.హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పోరులో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. లీడింగ్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను సైతం దాటేసింది. కచ్చితంగా చెప్పాలంటే విపక్ష బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. అధికారికంగా ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. తమ పార్టీకే మెజార్టీ దక్కడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో 35 సీట్ల సాధించిన పార్టీదే అధికారం. విపక్షం బీజేపీ ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉంది. అధికార కాంగ్రెస్ 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ప్రభుత్య వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపింది మరోవైపు పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇంకోవైపు దళిత నేత జిగ్నేష్ మేవానీ, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్.. ఇలా బీజేపీపై ముప్పేట దాడి మొదలైంది.గుజరాత్ లో మరో ఐదేళ్లు బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. వరుసగా ఆరోసారి అధికారంలోకి రావడంలో బీజేపీ విజయవంతమైంది. దీనికి కారణం మళ్లీ ఆ ఒక్కడే. అంతా అనుకున్నట్లే ప్రధాని మోదీయే అన్నీ తానై బీజేపీని నడిపించారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించిన మోదీ.. బీజేపీకి మరో అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. ప్రచారంలో మొదట్లో సహజంగానే అభివృద్ధి నినాదంతోనే మోదీ బరిలోకి దిగారు. నేనే అభివృద్ధి.. నేనే గుజరాత్ అంటూ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇదే గుజరాత్ మోడల్ అభివృద్ధిని కాంగ్రెస్ హేళన చేస్తూ ప్రచారం మొదలుపెట్టింది. సూట్ బూట్ సర్కార్ అన్న కాంగ్రెస్ విమర్శలకు దీటుగా.. ప్రధానంగా మిడిల్ క్లాస్, బలహీన వర్గాలను ఆకర్షిస్తూ మోదీ ప్రచారం సాగింది. రోడ్లు, సాగు, తాగునీరు, శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా, విద్యాభివృద్ధి, పారిశ్రామికీకరణ.. ఇలా ప్రతి రంగంపై బీజేపీ అభివృద్ధి మోడల్‌ను వివరిస్తూ వెళ్లారు. దీనికితోడు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో ఎక్కువగా నష్టపోయింది గుజరాతే అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడక ఏమాత్రం కాదని అర్థమైపోయింది. పైకి 150 స్థానాలు గెలుస్తామని చెబుతున్నా.. లోపల మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నది. ఇప్పుడు కూడా 2012లో సాధించిన 115 స్థానాల కంటే తక్కువే వచ్చాయి. నోట్ల రద్దు, జీఎస్టీలాంటి ఆర్థిక విధానాలు సామాన్యుడి నడ్డి విరిచిన మాట నిజమే. కానీ గుజరాత్ ఎన్నికల్లో దానిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేలా మోదీ ప్రచారం నిర్వహించారు. అవినీతిని అంతమొందించడంలో భాగంగానే తాను ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, దీర్ఘకాలంలో ఈ ఫలాలు సామాన్యుడికి అందుతాయన్న తన వాదనను ఓటర్లకు ఎక్కించడంలో మోదీ విజయవంతమయ్యారు. ఈ రెండు నిర్ణయాల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మోదీ తన మాటల చాతుర్యంతో కొంతైనా తగ్గించగలిగారు. సహజంగానే మోదీ మరోసారి తన ప్రచారానికి హిందుత్వ అనే పదునైన అస్త్రాన్ని సరైన సమయంలో వాడుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియామకం ఇక లాంచనమే అన్న సమయంలో వాళ్లది ఔరంగాజేబ్ పాలన అంటూ ప్రచారం మొదలుపెట్టారు మోదీ. కాంగ్రెస్ వస్తే ఇక ముస్లిం రాజ్యమే అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. అయోధ్యకు, ఎన్నికలకు ముడిపెట్టిన కపిల్ సిబల్ వ్యాఖ్యలను అనుకూలంగా మలచుకున్నారు. రామ మందిరానికి కాంగ్రెస్ అడ్డుపడుతున్నదన్నదని చెప్పడం మొదలుపెట్టారు. ఇక గుజరాత్‌లో తనను ఓడించడానికి కాంగ్రెస్ ఏకంగా పాకిస్థాన్‌తోనే చేతులు కలిపిందన్న ఆరోపణ అసలు మోదీ ప్రచారానికే హైలైట్. ఇది ఓటర్లలో ఆయన పట్ల ఓ రకమైన సింపథీని క్రియేట్ చేయగలిగింది. చివరగా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పరోక్షంగా మోదీకి పెద్ద సాయమే చేశారు. ఆయన చేసిన నీచ్ ఆద్మీ కామెంట్స్‌ను ప్రధాన అస్త్రంగా మలచి మళ్లీ కాంగ్రెస్‌పైకే వదిలారు మోదీ. కాంగ్రెస్ తనను తక్కువ జాతి వ్యక్తి అంటూ అవమానిస్తున్నదని చెప్పుకున్నారు. ఓ పబ్లిక్ ర్యాలీలో అయితే ఏకంగా 1 నిమిషాల పాటు కాంగ్రెస్, ఇతర ప్రతి పక్షాల వాళ్లు తనను ఎన్నేసి మాటలన్నారో సుదీర్ఘంగా వివరించారు. మొత్తానికి.. నన్ను నమ్మండి.. అందరూ వ్యతిరేకంగా ఉన్న సమయంలో మీరు నాకు అండగా ఉంటారా లేదా? ఢిల్లీలో కూర్చున్న నేను కాకపోతే మీ పనులు ఎవరు చేస్తారు? ఈ సమయంలో నాకు అండగా నిలుస్తారా లేదా అన్న మోదీ ప్రశ్నలకు గుజరాత్ ఓటర్లు తమ సమాధానం చెప్పేశారు. మరో ఐదేళ్ల బీజేపీ పాలనకు ఓకే చెప్పారు.ప్రజా వ్యతిరేకతను అధిగమించలేక సతమతమవుతున్న అధికార కాంగ్రెస్ ను బీజేపీ తనదైన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కాంగ్రెస్ నుంచి కొందరు నేతలను ఆకర్షించగలిగింది. కీలక ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతలు బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ కు మైనస్ గా మారింది.2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 36 సీట్లు గెలుచుకుంది. తర్వాత ఆ ఫిగర్ 35కు పడిపోయింది. కమలదళం 26 స్థానాలు కైవసం చేసుకుని చిరకాలంలోనే ఆ సంఖ్యను 28కి చేర్చుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని మొత్తం నాలుగుస్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ తనకు పట్టు ఉన్న ప్రాంతాల్లోనూ బలహీనపడింది. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారనుకున్న వారు విపక్షం పంచన చేరడంతో కాంగ్రెస్ ఓట్ షేర్ తీవ్రంగా ప్రభావితమైంది. మొత్తంగా బీజేపీ తనదైన స్ట్రాటజీలతో హిమాచల్ ప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది.స్వయంకృతాపరాధాలు కూడా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమికి దారితీశాయి. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసు ఓటింగ్ సరళిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ఉదాసీనత వల్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఈ అంశాలనే హైలెట్ చేస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించగలిగింది. రాష్ట్రాభివృద్ధి తమతోనే సాధ్యమని పట్టణ-గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని హామీలిచ్చింది. మొత్తంగా తనదైన స్ట్రాటజీలతో కమలదళం తాజా అసెంబ్లీ పోరులో ముందజలో నిలిచింది. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో అధికారం బదిలీ అవుతోంది. కాంగ్రెస్-బీజేపీలే ఒకదాని తర్వాత మరొకటి పవర్ లోకి వస్తున్నాయి. మూడు దశాబ్దాల్లో ఒకే పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారం దక్కలేదు. ఈ సంప్రదాయానికి చెక్ పెట్టే అవకాశాలను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకోలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అవినీతి కేసుల్లో చిక్కుకోవడంతో అధికార పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడింది. తాజా అసెంబ్లీ పోరులో పరాజయంపాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com