Home > General > క్యాష్ లెస్ కోసం వంద రోజుల ప్రణాళిక

క్యాష్ లెస్ కోసం వంద రోజుల ప్రణాళిక

అమెరికా, చైనా బిజినెస్ డీల్
సంక్రాంతి బాదుడు షురూ...
 cash less_apduniaరైతులను నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భాగస్వాములుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయ శాఖలకు ఈ కార్యక్రమం అమలుచేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. డిజిధన్ మేళాలను మండలానికి కనీసం రెండు గ్రామాల్లో నిర్వహించి అక్కడ రైతులను సమీకరించాలని నిర్ణయించారు. నగదు రహిత లావాదేవీలపై వంద రోజుల ప్రణాళికలతో వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టనున్నది. ఇందులో ప్రధాన మంత్రి ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజనను రైతులకు వివరిస్తారు. ఈ పథకంలో దేశ వ్యాప్తంగా రోజుకు 1,500 బహుమతులు అందజేయనున్నారు. ఏరోజుకారోజు లక్కీ డ్రా నిర్వహిస్తారు. రూపే కార్డు, యుపిఐ, ఎఇపిఎస్ తదితర పద్ధతుల్లో నగదు రహిత లావాదేవీలు జరిపిన రైతు ఖాతా నెంబర్లను లక్కీ డ్రాలో ఉంచి ఎంపికైన రైతులకు వెయ్యి రూపాయలు చొప్పున బహుమతులు అందజేస్తారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా పది వేలు, ఐదు వేలు చొప్పున పంపిణీ చేయనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మెగా బహుమతులను రైతులకు ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా మూడు మెగా బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతి కింద కోటీ, రెండో బహుమతి కింద 50 లక్షలు, మూడో బహుమతి కింద 25 లక్షలు అందజేస్తారు. నగదు రహిత లావాదేవీల్లోని కేటగిరిల మేరకు ప్రతి కేటగిరికి ఒక విజేతను ఎంపిక చేస్తారువీటి నిర్వహణ బాధ్యతను ఎరువులు, పురుగు మందుల తయారీ కంపెనీలకు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ లీడ్ ఏజన్సీగా వ్యవహరించనున్నది. డిజిధన్ యోజనను సిఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు గ్రామాలవారీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లా పాలనాధికారిని నోడల్ అధికారిగా నియమించారు. ఎరువుల తయారీదారులు మేళాలు నిర్వహించిన గ్రామాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలులో నగదు రహిత లావాదేవీల గురించి అవగాహన కల్పించనున్నారు. జిల్లాకు సంబంధించిన ఇఫ్కో తదితర కంపెనీలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకువచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *