Home > Health > గ్రామాల్లో అంటువ్యాధుల భయం

గ్రామాల్లో అంటువ్యాధుల భయం

అల్లంలో ఔషధ గుణాలన్నెన్నో
డెంగీ నమోదులో దర్శి ఫస్ట్‌

kadapaకడపజిల్లా లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం, వాటితో ప్రజలు అంటువ్యాధులు ప్రబలి మంచాలెక్కి వారి పరిస్థితి వర్ణనాతంగా తయారైంది. వృద్ధులు, పసిపిల్లలు, ఇళ్లకే పరిమితమై వారికి సైతం అంటువ్యాధులు ప్రబలి గజ గజవణికిపోతూ ముక్కుతూ మూలుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు జిల్లాలోని పురపాలక సంఘాల్లోనూ నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది నగర పాలకంలో సంబంధిత అధికారులు పట్టించుకోని కారణంగా పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధానంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థ పాలకవర్గ సభ్యులతోపాటు సంబంధిత అధికారులు పారిశుద్ధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం వహిస్తుండటంతో విషజ్వరాలు డెంగ్యు, మలేరియా, తదితర వ్యాధులు సోకి పిల్లా పెద్దా అన్న తారతమ్యం లేకుండా వేలాది మంది ఆసుపత్రులకే పరిమితమయ్యారు. ఆర్థిక స్థోమత లేని వారు వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలోని జయనగర్ కాలనీ, చిన్నచౌకు, బుడగజంగం కాలనీ, తిలక్‌నగర్, గౌస్‌నగర్, రవీంద్రనగర్, మరాఠివీధి, మృత్యుంజయకుంట, అల్మాస్‌పేట, సాయిపేట, ప్రకాష్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, సుబ్బిరెడ్డి కాలేజి, నాగరాజుపేట తదితర ప్రాంతాల్లో లోతట్టుప్రాంతాలన్నీ వర్షం నీరు మురుగునీరు ఏకమై కుంటలు, చెరువులుగా మారాయి. బుగ్గవంక, కెసి కెనాల్ జనవాసాల మధ్య ఉండటంతో గత కొంతకాలంగా ఎండిపోయి నగరంలోని డ్రైనేజి నీరు, వర్షపునీరు ఏకమై రోడ్లపై పారుతున్నాయి. నీరంతా దిగువ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి ప్రవేశించి దుర్వాసన వెదజల్లుతోంది. నగర పాలక సంస్థ చెత్తాచెదారం, డ్రైనేజి మట్టిని తొలగించి రోడ్లపైనే వేయడంతో వర్షపునీటికి తిరిగి కాలువల్లోకి వెళ్లి రోడ్లన్నీ చీధ్రంగా మారాయి. నగర పాలకంలో అడుగడుగునా రాజకీయ జోక్యంతో ఒక ప్రాంతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందని కారణంగా ప్రతి వర్షాకాలంలో ఇదే తంతు కొనసాగుతోంది. అండర్ గ్రౌంఢ్ డ్రైనేజి పేరుతో తూతూ మంత్రంగా డ్రైనేజిలు నిర్మించారు తప్ప పాత డ్రైనేజి కాలువలు మూయని కారణంగా ఈ వర్షానికి ఆ కంపంతా రోడ్లపైనే పారుతోంది. భూగర్భడ్రైనేజి కూడా సక్రమంగా పనిచేయడం లేదు. నగర పాలక సంస్థ ఏర్పాటుచేసిన చెత్తా చెదారానికి పెద్ద పెద్ద తొట్లు నిండిపోయినా ఆ చెత్తాచెదారాన్ని తొలగించడం లేదు. దీంతో పందులు, పశువులు చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయడం, దుర్వాసన వెదజల్లుతోంది. ఇక కార్పొరేటర్లు తమ స్వార్థప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతాల్లోనే శుభ్రం చేయిస్తున్నారు తప్ప అన్ని ప్రాంతాల్లో శుభ్రం చేయించడం లేదు. నగర పాలకంలోని శానిటరీ అధికారులు, సిబ్బంది , ఇంజనీరింగ్ అధికారుల్లో సమన్వయం లోపించి ఎవరికివారే యమునా తీరే అన్నచందంగా పనిచేస్తూ పారిశుద్ధ్య వ్యవస్థను గాలికి వదిలేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *