Home > Politics > చివరి అంకానికి చేరుకున్న పార్లమెంట్

చివరి అంకానికి చేరుకున్న పార్లమెంట్

యూపీలో మళ్లీ మహాకూటమి...
పెద్ద‌నోట్లు ర‌ద్దు చేస్తూ ఎన్డీఏ ఘోర‌మైన త‌ప్పు చేసింది

parliament-apduniaమరో రెండు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి… ప్రధాన బిల్లులపై చర్చ లేకుండానే నెల రాజులు కాలగర్భంలో కలిసిపోయాయి. పెద్ద నోట్ల రద్దుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకోవడం, నినాదాలు, గందరగోళంతోనే నెల్లాళ్ల పార్లమెంట్ సభలు వృథాగా సాగాయి. వేల కోట్ల ప్రజా దనం బుగ్గిపాలయింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన వస్తు సేవా పన్ను బిల్లు(జిఎస్‌టి బిల్లు)ను కూడా ప్రవేశపెట్టే అవ కాశం లేకపోయింది. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను నిందించాలి. పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. స్పీకర్‌ది. ఆ విషయంలో అధికారపక్షం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయి. బడా నోట్ల రద్దు తరువాత నవంబరు 16న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అనగానే, ఆ అంశంపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని దేశ ప్రజలంతా ఆశించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, వామపక్షాలు పార్లమెంటు వేదికగా అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అయినా గందరగోళమే తప్ప అర్థవంతమైన చర్చ జరగలేదు. రాజ్యసభలో మొదటి రోజు నోట్ల రద్దుపై కాస్త చర్చ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించిన కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మొదట్లో పార్లమెంటుకు హాజరు కాలేదు. ప్రధాని పార్లమెంటుకు జవాబుదారీ. తన నిర్ణయంలో మంచి చెడ్డలు, ఆ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు, నోట్ల రద్దు నిర్ణయం వల్ల భవిష్యత్‌లో కలిగే ప్రయోజనాలను పార్లమెంటు వేదికగా దేశ ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. అలాంటి ప్రధాని కీలక చర్చ సందర్భంగా ముఖం చాటువేయడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది. ప్రధాని గైర్హాజర్‌ దేశ ప్రజలను అయోమయంలో పడేసింది. నరేంద్ర మోడీ పార్లమెంటుకు హాజరు కాకుండా, వివిధ బహిరంగ సభల్లో నల్ల కుబేరులకు ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయని దుమ్మెత్తి పోయడం మరో రాజకీయం. అందుకే ప్రధాని పార్ల మెంటుకు హాజరైనా, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. నోట్లపై చర్చ అంశం పక్కకు పోయి ప్రధాని ప్రతిపక్షాలకు క్షమా పణ చెప్పాలన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అధికార పార్టీ, సర్కార్‌ రె చ్చి పోయాయి. క్షమాపణ అంశంపై గగ్గోలు సృష్టిస్తూ, రోజూ సభలు పదేపదే వాయిదా పడేటట్లు చూశాయి. తప్ప చర్చకు దోహదం చేయలేదు.
కాంగ్రెస్‌ మొదట్లో రూల్‌ నంబర్‌ 56 కింద వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబట్టింది. స్పీకర్‌ వాయిదా తీర్మానాన్ని అంగీకరించలేదు. అయితే అధికార పక్షం సెక్షన్‌ 193 నిబంధన ప్రకారం చర్చ జరగాలని భీష్మించింది. ఆ నిబంధన ప్రకారం చర్చ అనంతరం వోటింగ్‌ కు అవకాశం ఉండదు. అందువల్ల ప్రతిపక్షాలు కనీసం సెక్షన్‌ 184 ప్రకారం చర్చించాలని కోరినా అధికారపక్షం అంగీకరించలేదు. ఈ నిబంధనల గందరగోళంలో అసలు చర్చే జరగలేదు. నోట్ల రద్దుపై చర్చించేందుకు తమను అనుమతించడం లేదని విపక్షాలు, అధికార పక్షం వాదులాటలో కాలాపహరణం జరిగిపోయింది. లోక్‌సభలో ఎన్డీఏ పక్షానికి భారీ మెజారిటీ ఉంది. 543 మంది సభ్యుల లోక్‌సభలో 339 మంది సభ్యుల బలం ఉంది. అలాంటి సమయంలో చర్చకు భయపడాల్సింది ఏముంది? ఏ సందర్భంలోనైనా స్పీకర్‌ ప్రధాని మాట్లాడతారు అని రూలింగ్‌ ఇస్తే కాదనే దమ్ము సభ్యులెవరికీ లేదు. అయినా చర్చ జరగలేదు. ప్రధాని ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ప్రభుత్వమే చర్చ జరగకుండా తప్పించుకున్న దన్నది సుస్పష్టమైంది.2017 ఏప్రిల్‌ 1 నుంచి వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) అమలులోకి రావలసిఉంది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు దాదాపు నీరుకారిపోవడంతో ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పటికే జిఎస్‌టి బిల్లుపై ఏకాభిప్రాయం కుదరడం, మెజారిటీ అసెంబ్లీలు ఆమోదించడం జరిగింది. కేంద్ర జిఎస్‌టి బిల్లు, సమగ్ర జిఎస్‌టి బిల్లు, జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయే రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు సంబంధించిన మరో బిల్లును డిసెంబర్‌ 16న ముగిసే పార్లమెంటు శీతాకాలం సమావేశాలలోనే ఉభయ సభలతో ఆమోద ముద్ర వేసుకోవాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరలేదు. జిఎస్‌టి కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ముసాయిదా బిల్లు, మూడు అనుబంధ బిల్లులు సిద్ధం కాలేదు. అందువల్ల మరో రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం లేదు. ఇక ఈ బిల్లులను జనవరి నెలాఖరు నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలోనే ప్రవేశపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ జిఎస్‌టి బిల్లును ఆమోదించని రాష్ట్రాలన్నీ కూడా ఈ బిల్లును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే, అంటే జిఎస్‌టి అమలులోకి వచ్చే లోగానే ఆమోదించాలి. ఇక ఐదు నెలల వ్యవధి మాత్రమే ఉంది. జిఎస్‌టి కౌన్సిల్‌ ఆరో సమావేశంలోనూ ముసాయిదా బిల్లు ఖరారు కాలేదు. డిసెంబర్‌ 22, 23 తేదీలలో జిఎస్‌టి కౌన్సిల్‌ తదుపరి సమావేశం జరగాల్సి ఉంది. కేంద్రం విముఖతతో ఏకాభిప్రాయం సాధ్యం కావడం లేదు. ఏమైనా, పార్లమెంటు శీతాకాలం సమావేశాలుకు తెర పడినట్లే. ప్రతిపక్షాలను నిందించినా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *