Home > Movies > జక్కన్న నెక్స్ట్ సినిమా మహాభారతం

జక్కన్న నెక్స్ట్ సినిమా మహాభారతం

మోక్షజ్ఞకు లైన్ క్లియర్
'నమో వేంకటేశాయ'కు బంజారాల సెగ

Rajamouli-ticket_apduniaదర్శక ధీరుడు రాజమౌళి ”బాహుబలి” సినిమాను పూర్తి చేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం అయింది. బాహుబలి తరువాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి ఇప్పటికే అందరిలో నెలకొంది. రాజమోళి ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి కంటే ఎవరితో సినిమా చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఎక్కువైంది. ఇప్పటివరకు పరాజయం ఎరగని రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి చెప్పేశాడు? అవును.. ఇటీవలే ఓ కార్యక్రమంలో ఈ విషయంపై స్పందించిన రాజమౌళి ఏం చెప్పాడో తెలుసా.. మహాభారత కథను మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో చూపించాలన్నదే తన కోరిక అని చెప్పాడు. అందులో నుంచి ఓ పాత్రను తీసుకున్నా.. ఓ ఉపకథను తీసుకున్నా ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్పాడు. సినిమా అంటూ చేస్తే ఓ ముప్పై ఏళ్ల తరువాత కూడా దానిగురించి మాట్లాడుకోవాలని అన్నారు. అంటే జక్కన్న నెక్స్ట్ సినిమా మహాభారతం తీస్తాడనే విషయం చెప్పకనే చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *