Home > Crime > టోపీకింద.. నోట్లో..దుస్తుల్లో అన్నీ బంగారు బిస్కెట్లే

టోపీకింద.. నోట్లో..దుస్తుల్లో అన్నీ బంగారు బిస్కెట్లే

ఫోన్ మాట్లాడుతూ మేడపై నుంచి పడి విద్యార్థిని మృతి
పాతనేరస్థుడు అరెస్టు

gold buscuits_apduniaసౌదీ అరేబియా నుంచి భారత్‌కు అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న నలుగురు భారతీయులను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 29 లక్షల రూపాయల విలువగల బంగారాన్ని ముంబాయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాహ్ నుంచి మస్కట్ మీదుగా ముంబాయికి చేరుకున్న విమానం నుంచి నలుగురు యువకులు దిగారు. మహ్మద్ రెహాన్, మహ్మద్ ఇస్తియాక్, మహ్మద్ ఇస్రార్, ఫరూఖ్ ఇస్లాం అనే నలుగురూ విమానం నుంచి దిగినప్పటి నుంచి టెన్షన్‌గా కనిపించడంతో వారిపై అక్కడ ఉన్న సిబ్బందికి అనుమానం వచ్చింది. వారి బ్యాగులను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. నలుగురిలో ఓ వ్యక్తి సరిగా మాట్లాడలేకపోవడంతో నోరు తెరిపించారు. నోట్లో ఉన్న బంగారు బిళ్లలను చూసి పోలీసులు అవాక్కయ్యారు. వారు ధరించిన టోపీల కింద, దుస్తుల్లోనూ, రహస్య జేబుల్లోనూ ఇలా మొత్తం మీద 927 గ్రాముల బంగారాన్ని బయటకు తీశారు. రెహాన్ అనే వ్యక్తి నోటి నుంచి ఏకంగా 14 బంగారు బిళ్లలను తీశారు. నలుగురిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *