Home > World News > ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి

ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి

అడ్డంగా దొరికిపోయిన ట్రంప్ కూతురు
ప్రపంచమంతా శాఖాహారులైతే ఎలా ఉంటుంది..

putin-trump_apduniaఅగ్ర‌ దేశాధినేత‌లు పుతిన్‌, ట్రంప్ ర‌హ‌స్యంగా క‌లుసుకున్నారు. ఇటీవ‌ల హాంబ‌ర్గ్‌లో జ‌రిగిన జీ20 దేశాల స‌ద‌స్సులో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ రెండ‌వసారి ర‌హ‌స్యంగా భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రూ ఓ గంట పాటు చ‌ర్చ‌లు నిర్వ‌హించిన‌ట్లు కూడా సమాచారం. ఈ విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు వైట్‌హౌజ్ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే పుతిన్‌తో సీక్రెట్ డిన్న‌ర్ చేశారా అన్న ఆరోప‌ణ‌ల‌ను ట్రంప్ కొట్టిపారేశారు. అదో ఫేక్ న్యూస్ అన్నారు. గత ఏడాది జ‌రిగిన దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ట్రంప్ విక్ట‌రీ కోసం ర‌ష్యా స‌హ‌క‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను ర‌ష్యా, ట్రంప్ ఇప్ప‌టికే ఖండించాయి. అయితే హాంబ‌ర్గ్‌లో రెండ‌వసారి ఇద్ద‌రు నేత‌లు ర‌హ‌స్యంగా క‌లుసుకోవ‌డం ప‌ట్ల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుతిన్ ఆయ‌న ట్రాన్స్‌లేట‌ర్‌తో ట్రంప్‌ను ఒంట‌రిగా క‌లుసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com