Home > Health > డెంగీ నమోదులో దర్శి ఫస్ట్‌

డెంగీ నమోదులో దర్శి ఫస్ట్‌

గ్రామాల్లో అంటువ్యాధుల భయం
టీవీ ఎక్కువగా చూస్తే షుగర్!

denguప్రకాశం జిల్లాలోని గ్రామాల్లో డెంగీ జ్వరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది డెంగీ జ్వరాలు డబుల్‌ సెంచరీని దాటే అవకాశాలున్నాయి. 2017 జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు కేవలం 7 నెలల కాలంలోనే జిల్లాలో నమోదైన డెంగీ కేసులు 152కు చేరుకున్నాయి. అదే గత ఏడాది 2016లో ఏకంగా 194 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా మలేరియా కార్యాలయ గణాంకాల మేరకు.. 2013లో కేవలం 15 కేసులు మాత్రమే జిల్లా మొత్తం మీద నమోదు కాగా ఆ మరుసటి సంవత్సరం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది 2015లో 74 కేసుల నుంచి గత ఏడాది 194 కేసులు నమోదయ్యాయి.జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి మండలం డెంగీ కేసుల నమోదులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది నమోదైన 152 కేసుల్లో దర్శి మండలంలో అత్యధికంగా 16 మందికి డెంగీ సోకింది. తర్వాత స్థానం మార్కాపురంలో 10 కేసులు, యర్రగొండపాలెంలో 8, కొండపి, ఒంగోలులో తలో 7, తర్లుపాడులో 6, దొనకొండలో 5, తాళ్లూరులో 5, చీమకుర్తిలో 7 కేసులు మిగిలిన మండలాల్లో 80 కేసుల వరకు నమోదయ్యాయి. నెలన్నర క్రితం సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు, మద్దులూరులో ఏకంగా 8 మందికి డెంగీ జ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం చీమకుర్తి మండలం పాటిమీదపాలెంలో ఆరుగురికి డెంగీ జ్వరాలు వచ్చి ఒంగోలు రిమ్స్‌లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు రెండు, మూడు రోజుల నుంచి దేవరపాలెంలో విషజ్వరాలు వచ్చి ఇంటికి ఇద్దరు ముగ్గురు లెక్కన మంచాన పడ్డారు. వారిలో ఒకరిద్దరికి డెంగీ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *