Home > Politics > తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌

నంద్యాల్లో చంద్రబాబు వ్యూహం అదే
ఎన్డీఏ రాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు

palani swamy_apduniaఆర్‌.కె.నగర్‌ ఉప ఎన్నికల్లో లంచాల కేసుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి కె. పళనిస్వామి, ఆరోగ్య మంత్రి సి.విజయభాస్కర్‌, ఎఐఎడిఎంకె డిప్యూటి జనరల్‌ సెక్రటరీ టిటివి దినకరన్‌తో సహా మరికొంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఆదేశించింది. ఆర్‌.కె. నగర్‌లో ఏప్రిల్‌ 12న ఉప ఎన్నికలు జరగడానికి ముందు ఓటర్లకు నగదు పంపిణీ చేసిన సంఘటనపై దర్యాప్తును డిమాండ్‌ చేస్తూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన అభ్యర్ధనకు స్పందనగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం వెలువడింది. ఆ రోజు నగదు పంపిణీకి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎఐఎడిఎంకె(అమ్మ) వర్గానికి చెందిన నేత విజయ భాస్కర్‌ నివాసంపై ఐటి అధికారులు దాడులు జరిపి రూ.90 కోట్ల మేరకు ఓటర్లకు పంపిణీ చేసినట్లున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికలలో టిటివి దినకరన్‌ను అమ్మ వర్గం తన అభ్యర్థిగా నామినేట్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *