Home > World News > National > తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

తాజ్‌మహల్ వద్ద పాము… టూరిస్టులు పరుగో పరుగు

అప్ డేట్ కాకపోతే... పింక్ స్లిప్పులే
మిడ్ డే మీల్స్ లో పాము

snake at tajmahal_apduniaప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం కోసం పెద్దగా కేకలేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజ్‌మహల్ వద్దకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది గంటపాటు శ్రమించి పామును పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ వేసవిలో దాహార్తితో తల్లడిల్లిన పాము చల్లదనం కోసం కట్టడం వైపు వచ్చిందన్నారు. పబ్లిక్ వాటర్ సదుపాయం కోసం నాలుగు ఆర్వో ప్లాంట్లను తాజ్‌మహల్‌ వద్ద నిర్వహిస్తున్నారు. నీరు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి పామును గమనించడంతో కలకలం చెలరేగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ పాము ఆరడుగులు ఉన్నదని వారు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *