Home > General > తిరుపతి సిగలో “సెల్‌” పువ్వు

తిరుపతి సిగలో “సెల్‌” పువ్వు

గుర్రపు డెక్కలతో నిండిపోయిన కాల్వలు
ప్రమాదంలో ప్రజారోగ్యం

cell kon mobiles_apduniaతిరుపతి సిగలో సెల్‌ పువ్వు పూయనుంది. త్వరలో అత్యాధునిక ఫోన్ల తయారీకి కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సెల్‌కాన్‌ సంస్థ ఇక్కడి నుంచి నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. వాటిని దేశీయ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. రేణిగుంట విమానాశ్ర యానికి సమీపంలో రెండు ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లను (ఈఎంసీ) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంసీ-1 హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో సెల్‌కాన్‌, లావా, మైక్రో మ్యాక్స్‌, కార్బన్‌ కంపెనీలు తమ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి భారీగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఇందులో శరవేగంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ సెల్‌ కాన్‌. 2015 నవంబరులో ఈఎంసీ-1కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితం సెల్‌కాన్‌ కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. 22న యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రేణిగుంటకు సమీపంలోని వికృతమాల వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మరో ఈఎంసీ-2ను అభివృద్ధి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *