Home > Bhakti > తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: ఈవో

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి: ఈవో

వెయ్యి కోట్ల వెంకన్న
గత ఏడాది తిరుమలేశుని ఆదాయం ఎంతో తెలుసా!
ttd eo_apduniaకనుమ పండగ రోజున తెలుగు రాష్ట్రాల్లో గోపూజలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు అన్నారు. మీడియాతో సాంబశివరావు మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరంగా అల్పాహారం, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 8న ఉదయం 9 గంటలకు తిరువీధుల్లో శ్రీవారి ఉరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. 8, 9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరాయంగా భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు జరిగాయని వివరించారు. ఈనెల 8న ఉదయం 9గంటలకు తిరువీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారి వూరేగింపు, 9న వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 8,9 తేదీల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేసినట్లు చెప్పారు. 2016 సంవత్సరంలో మొత్తం 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.1,018 కోట్ల ఆదాయం వచ్చిందని  సాంబశివరావు తెలిపారు.  రికార్డు స్థాయిలో 10 కోట్ల 34 లక్షల లడ్డూలను భక్తులకు పంఫీణీ చేశామని ఈవో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *