Home > Bhakti > తిరుమలేశునికి ఊరట!

తిరుమలేశునికి ఊరట!

జులై 2 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో వెంకన్న వైభవోత్సవాలు
బోనాలకు సన్నాహాలు

tirumala laddu_apduniaతిరుమల వెంకన్నకు ఊరట లభించింది. తిరుపతి లడ్డూ ప్రసాదం, తలనీలాలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపు లభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఆదివారం జరిగిన 17వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) ఈ పన్ను పరిధిలోకి రాకుండా చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించిందని, అయితే దేశవ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని లడ్డూ ప్రసాదానికి, తలనీలాలపై మాత్రం మినహాయింపు ఇచ్చారని విలేకరులకు తెలిపారు. అలాగే తిరుమలలో రూ.వెయ్యి లోపు తీసుకునే అద్దె గదులకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని, ఆపైన మాత్రం పన్ను ఉంటుందని చెప్పారు. సామాన్యులపై భారం పడకుండా, వ్యాపారస్తులను ఇబ్బందులు గురిచేయని విధంగా జీఎస్టీ విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ నెల 22న జీఎస్టీ అమలుకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని.. కేంద్రం కోరినట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులను జూలై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ సమావేశంలో అగరబత్తి, బయోగ్యాస్‌, జీడిపప్పు వంటి వాటిపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా రాష్ట్రప్రభుత్వం కృషి చేసింది. ఆహార ధాన్యంపై పన్నులు తీసేయడం వల్ల మనకు ఏటా రూ.వెయ్యి కోట్లు నష్టం వస్తున్నా జీఎస్టీకి మద్దతిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *