Home > Editorial > దాసరీ.. చిత్రసీమలో లేరు నీకు సరి!

దాసరీ.. చిత్రసీమలో లేరు నీకు సరి!

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మైలు రాయి...
త్వరలో కొత్త రూపాయి...

dasari_apduniaదర్శకత్వం.. నిర్మాణం.. పాటల రచన.. నటన.. ఇలా బహుముఖ ప్రజ్ఞల్లో మరే దర్శకుడూ రాణించలేనంతగా.. ప్రతిభ చూపించి.. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావుకు అగ్రస్థానం దక్కుతుంది. 75 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 151 సినిమాలకు దర్శకత్వం వహించి ఎక్కువ సినిమాలు విజయవంత మయ్యేలా చేసిన ప్రతిభాశాలి మన దాసరి. 1942 మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో.. మహాలక్ష్మి, సాయి రాజ్ దంపతులకు జన్మించిన దాసరిని.. ఇంతటివాడు అవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. కానీ జీవన ప్రస్థానంలో ఒక్కో అడుగూ వేస్తూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఒక్కో అడ్డంగిని అధిగమిస్తూ.. ఇప్పటితరానికి అసలైన మార్గదర్శకుడిగా నిలిచారాయన. తాతా మనవడు సినిమాతో సినిమాల్లో ప్రవేశించి.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలతో అజరామరమైన సినిమాలు రూపొందించారు. తాతామనవడు, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మేఘసందేశం, స్వర్గం నరకం, లంకేశ్వరుడు, ఓసేయ్ రాములమ్మ, మామగారు, కంటే కూతుర్ను కనాలి.. ఇలా దాసరి నుంచి జాలువారిన ఏ సినిమా గురించి చెప్పుకున్నా రాసుకుంటే ఓ గ్రంథం.. చెప్పుకుంటే ఓ చరిత్ర. దర్శకరత్నగానే కాదు ఇండస్ట్రీకి మంచి మంచి నటీనటుల్ని పరిచయం చేసిన స్ఫురద్రూపిగా కూడా దాసరిది అందెవేసిన చేయి. మోహన్ బాబు, మురళీ మోహన్ లాంటి నటులను తీర్చిదిద్దింది దాసరి నారాయణరావే. ఇలా సినీ పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో.. రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ తరఫున చెరగని ముద్ర వేశారు.. దాసరి. తెలుగుదేశం పార్టీలోకి స్వయానా నందమూరి తారకరామారావు ఆహ్వానించినా కూడా సున్నితంగా తిరస్కరించి.. కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆత్మాభిమానం ఆయన సొంతం. అదే దాసరిని కేంద్ర మంత్రిని చేసింది.. ఉన్నత స్థానం అందుకునేందుకు కారణమైంది. ఇలా ఒకే వ్యక్తి.. పలు రకాలైన ప్రతిభ చూపడం అంతే అది మామూలు విషయం కానే కాదు.. అది దాసరి లాంటి వారికి తప్ప మరెవరికీ సాధ్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *