Home > Politics > నంద్యాల్లో చంద్రబాబు వ్యూహం అదే

నంద్యాల్లో చంద్రబాబు వ్యూహం అదే

ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు పలికిన సీఎం కేసీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్‌ఐఆర్‌

chandrababu_apduniaనంద్యాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వేసుకున్న వ్యూహాలు కొంత అడ్డం తిరిగినట్టుగా కనిపిస్తున్నాయి. అటు శిల్పా మోహన్ రెడ్డి ఇటు, భూమా వర్గాన్ని చేతిలోనే పెట్టుకుని మూడో వ్యక్తిని బరిలో దింపి అర్థ, అంగ బలాన్ని ఉపయోగించుకుని నెగ్గాలని బాబు లెక్కేశాడు. అయితే బాబు వ్యూహం మేరకు నడుచుకోవడానికి శిల్పా మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఆయన తనదారి తాను చూసుకున్నాడు. ఈ విధంగా బాబు వేసిన లెక్క కొంత అడ్డం తిరిగింది. అయితే ఇప్పుడు బాబు తన రెండో అస్త్రాన్ని సంధిస్తున్నాడు. అదే సానుభూతి అస్త్రం. భూమా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో వారి వారసులను రంగంలోకి దించుతున్నాడు చంద్రన్న. ఈ మేరకు తెలుగుదేశం తరపున భూమ బ్రహ్మానంద రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. ఫరూక్, ఎస్పీవై రెడ్డి అల్లుడులు టికెట్ ఆశిస్తున్నా బాబు వారిని నమ్ముకోవడం లేదు. భూమా బ్రహ్మానంద రెడ్డినే బరిలోకి దించి అమీతుమీకి సిద్ధం అవుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణించాడు కాబట్టి ఆయన వారసులపై సానుభూతి ఉంటుందనేది బాబు లెక్క. అయితే ఇక్కడ పోటీ చేస్తున్నది భూమా నాగిరెడ్డి సొంత తనయ లేదా తనయుడు కాదు. అన్న కొడుకు. అయినప్పటికీ ఇంటి పేరుతో సానుభూతి వర్షిస్తుందని బాబు ఆశిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇక వైకాపా తరపున ఇక్కడ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు అయ్యింది. నంద్యాల విషయంలో మూడు నెలలుగా ఉండిన ఊహాగానాలన్నింటికీ తెరపడి ఇప్పుడు అభ్యర్థులు ఎవరో క్లారిటీ వచ్చింది ఇక అమీతుమీ తేల్చుకోవడమే మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *