Home > Politics > నంద్యాల టిడిపి అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల టిడిపి అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి

తెలంగాణలో జీఎస్టీ భారం 12 వేల కోట్లు
ఎంపీ రామ్మోహన్ రిసెప్షన్కు ఏర్పాట్లు..

bramhananda reddy_apduniaకర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ఖరారు చేశారు. శనివారం సిఎం ఆధ్వర్యాన జరిగిన కర్నూలు జిల్లా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం అభ్యర్ధిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జడ్పీ ఛైర్మన్‌ చమన్‌షావలిని తప్పుకోవాలని సిఎం ఆదేశించారు. ఒప్పందం ప్రకారం పూల నాగరాజును జడ్పీ ఛైర్మన్‌గా, బెస్త చలపతిని పుట్టపర్తి మున్సిపల్‌ ఛైర్మన్‌గా నియమించారు. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కర్నూలు, అనంతపురం జిల్లాల టిడిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నాయకత్వంపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎ.వి.సుబ్బారెడ్డి నిరసనపైనా చర్చించారు. మంత్రి అఖిలప్రియ నాయకత్వాన్ని కలుపుకుపోవాలని, దుందుడుకుగా వ్యవహరించొద్దని అన్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలోనూ చమన్‌షావలిని మందలించినట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు తప్పుకోవాల్సి ఉన్నా తప్పుకోకపోవడం పార్టీ నిబంధనలకు విరుద్ధమని సూచించారు. వెంటనే పూల నాగరాజును జెడ్పీ ఛైర్మన్‌గా ఎన్నుకోవాలని సూచించారు. దీనికి చమన్‌షా వలీ కొంత సమయం అడిగినట్లు తెలిసింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురంలో పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయని, దీన్ని తగ్గించాలని సూచించారు. మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం వల్ల స్థానిక నాయకత్వం మధ్య విభేదాలు పెరుగుతున్నాయని చెప్పినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *