Home > World News > International > పదేళ్ళనాటి వీడియోతో హీటెక్కించిన ట్రంప్

పదేళ్ళనాటి వీడియోతో హీటెక్కించిన ట్రంప్

ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య సూపర్ అన్న ట్రంప్
ట్రంప్ కు అపురూప కానుక ఇచ్చిన మోడీ
WWE Chairman Vince McMahon, center, held by "Stone Cold" Steve Austin, prepares to have his hair cut off by Donald Trump, left, and Bobby Lashley, right, after Lashley defeated Umaga at Wrestlemania 23 at Ford Field in Detroit, Sunday, April 1, 2007. (AP Photo/Carlos Osorio)

WWE Chairman Vince McMahon, center, held by “Stone Cold” Steve Austin, prepares to have his hair cut off by Donald Trump, left, and Bobby Lashley, right, after Lashley defeated Umaga at Wrestlemania 23 at Ford Field in Detroit, Sunday, April 1, 2007. (AP Photo/Carlos Osorio)

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీడియా మీద చిందులేశాడు. సోషల్ మీడియాను తన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకుంటానని. మోడరన్ డే (ఈనాటి) ప్రెసిడెంట్ (అధ్యక్షుడు) అంటే ఇలాగే ఉండాలని అంటున్నాడు. తన ట్విటర్ ఖాతాలో ఓ మార్ఫ్ డ్ వీడియో పోస్ట్ చేసి మీడియా మీద తన కసి తీర్చుకున్నాడు. ఎప్పటిదో పదేళ్ళ నాటి ఓ వీడియోని తెరమీదికి తెచ్చాడు. డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ఫైటింగ్ రింగ్ వద్ద బిజినెస్ సూట్ లో ఉన్న ఓ వ్యక్తి ముఖానికి పాపులర్ ఛానల్ సీ ఎన్ ఎన్ లోగో ఉన్నట్టు చూపుతూ, తన రూపంలో ఉన్న ఒకరు అతనిపై దాడి చేస్తున్నట్టు ఉందీ వీడియో. అయితే ఈ బూటకపు వీడియోపై జర్నలిస్టులు మండి పడుతున్నారు. ఇది పాత్రికేయుల మీద హింసను ప్రేరేపిస్తున్నట్టు ఉందని అంటున్నారు. నాటి వీడియోలో అప్పుడు ప్రో-రెజ్లింగ్ ఈవెంట్స్ సందర్భంగా గెస్ట్ సెలబ్రిటీగా వ్యవహరించిన ట్రంప్ ఓ రెజ్లర్ ను లాగి కింద పడవేసి దాడి చేసిన ఉదంతాలున్నాయి. ఇప్పుడు అదే వీడియోలో సీ ఎన్ ఎన్ లోగోతో మార్ఫ్ చేసి తన ట్విటర్ ఖాతాలో పెట్టడం మీడియా మీద దాడి చేసినట్టే కాదా అంటున్నారు. దీనిపై ఈ ఛానల్ లో పెద్ద చర్చే జరిగింది. ఇది పత్రికా స్వేచ్చను హరించడమేనని డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు కూడా దుయ్యబట్టారు. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. అయితే వైట్ హౌస్ లోని ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఈ పోస్ట్ సమంజసమేనని, ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదని ఆయనను సమర్థిస్తున్నారు. గతంలో కూడా ఈయనగారు తన వార్తలను మీడియా సరిగా కవర్ చేయడంలేదని, పక్షపాతం చూపుతున్నారని ఇంతెత్తున ఎగిరి పడిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *