Home > Crime > పూరీ అసిస్టెంట్ పేరుతో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు వాడేశాడట

పూరీ అసిస్టెంట్ పేరుతో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు వాడేశాడట

శిరీష మృతిపై పోలీసుల క్లారటీ
శేషాచలం నుంచి ఆగని స్మగ్లింగ్...

krishna veni_apduniaటాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని వదిలేశాడు. ప్రస్తుతం ఆ యువతి రోడ్డున పడింది. మోసపోయినట్టు గ్రహించి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రామాపురానికి చెందిన కృష్ణవేణి హీరోయిన్ కావాలన్న ఆశతో హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ విక్కీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మణికొండలోని ఓ సినీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఇతను పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేస్తున్నట్టు నమ్మించాడు. ఆ తర్వాత బాలకృష్ణ – పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తర్వాత చేపట్టే ప్రాజెక్టులో సినీ ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత తనను శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. రెండు నెలలుగా ఆమెను అన్ని విధాలుగా వాడుకుని ఇపుడు రోడ్డున పడేశాడు. మోసపోయిన విషయాన్ని గ్రహించి హైదరాబాద్ నగర పోలీసులను ఆశ్రయించింది. ఓ రోజున అర్దరాత్రి బలంగా పబ్‌కు తీసుకెళ్లి హుక్కా, మద్యం సేవించాడని, తాను వెజిటేరియన్ అని చెప్పినా నాన్‌ వెజిటేరియన్‌ను బలవంతంగా తినిపించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *