Home > Vanitha > Beauty > పెరుగుతో కురుల సౌందర్యం మీ సొంతం…!

పెరుగుతో కురుల సౌందర్యం మీ సొంతం…!

బాడీ లోషన్‌ వల్ల ఉపయోగాలు..!

hair-apduniaఈ రోజుల్లో జుట్టు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యువకులు సైతం ఈ సమస్య కలవరపరుస్తోంది. అందుకే ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి వివరాలు.

మృదువైన కురుల కోసం:
కావల్సినవి: గడ్డ పెరుగు : ఒక కప్పు ప్యాక్ ఇలా: గడ్డ పెరుగు తీసుకొని పేస్ట్ లాగా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఇలా తయారైన పేస్ట్ ను జుట్టుకు మాడుకు పట్టించి ఒక మాస్క్ లాగా వేసుకోవాలి. తర్వాత తల చుట్టూ కాటన్ టవల్ చుట్టుకొని అరగంటా పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెరుపు కూడా వస్తుంది. గుర్తుంచుకోవల్సినవి: నార్మల్ హెయిర్ ఉన్న వారు వారానికోసారి, పొడిజుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ ట్రై చేయడం మంచిది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండాలి.

ఆలివ్ ఆయిల్ తో :
కావల్సినవి: గడ్డ పెరుగు: 1కప్పు, ఆలివ్ ఆయిల్: 3చెంచాలు ప్యాక్ వేసుకోవడం ఇలా : ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోనుంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కింద వరకూ ప్యాక్ లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గుర్తుంచుకోవల్సినది: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి.

తేనెతో జుట్టుకు మంచి షైనింగ్:

కావల్సినవి: గడ్డపెరుగు : ఒక కప్పు, నిమ్మరసం: ఒక చెంచా, తేనె: ఒక చెంచా ప్యాక్ వేసుకోవడం ఇలా: ముందుగా గడ్డ పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రామన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ ను అప్లై చేయాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది. గుర్తుంచుకోవల్సినది: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.

మెంతులతో మెరుపు:
కావల్సినవి: గడ్డ పెరుగు : ఒకకప్పు, మెంతులు: అరకప్పు మెంతి ప్యాక్ వేసుకోవడం ఇలా : ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీలో పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్ లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్ ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకూ, మాడుకు పట్టించి గంట పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్ లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *