Home > Love Life > ‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గుంటే ఊరుకోం’

‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గుంటే ఊరుకోం’

ఎల్లలు దాటిన ప్రేమ పెళ్లితో ఏకమైంది
సేమ్‌సెక్స్ మ్యారేజ్‌కు జ‌ర్మ‌నీ ఓకే

phillipines_apduniaఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. గల్ఫ్ వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ నుంచి యూఏఈ వెళ్లిన వారు ఇటీవల కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఫిలిప్పైన్లు పెళ్లవ్వకుండానే ఆడ, మగ కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు. లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. గర్భం దాల్చడంతో పిల్లల్ని కూడా కంటున్నారు. ఈ విషయంపై యూఏఈ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్పైన్స్‌లో పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొవడం చట్టబద్ధమే. కానీ యూఏఈలో నేరంగా పరిగణిస్తారు. యూఏఈలో పనిచేస్తున్న పలువురు ఫిలిప్పైన్స్ పెళ్లి కాకుండానే సెక్స్‌లో పాల్గొన్నారు. పిల్లల్ని కూడా కన్నారు. దీంతో విషయం పోలీసులకు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం దేశం నుంచి బహిష్కరించారు. ఈ తీర్పుతో యూఏఈ అధికారులకు ఫిలిప్పైన్లకు హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే ఊరుకోబోమని, చట్టాలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. ఒక్క ఫిలిప్పైన్ పౌరులే కాకుండా మిగతా దేశాల వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *