Home > Politics > పోరాటాల ద్వారానే పార్టీ బలోపేతం

పోరాటాల ద్వారానే పార్టీ బలోపేతం

ఆ గవర్నర్ మాకొద్దు..!
ఏపీ సర్వర్ చాలా పటిష్ఠమైంది.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు

trust bhavan_apduniaతెలుగుదేశం తెలంగాణా శాఖ పార్టీ బ‌లోపేతం పై దృష్టి పెట్టింది. అదికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల‌నే ప్రధాన అస్త్రాలుగా ప్రజ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణయించింది. తెలంగాణా అభివ్రుద్దిలో టీడిపి పోషించిన కీల‌క పాత్రను ప్రజ‌ల్లోకి మ‌రింత విస్తృతంగా ప్రాచారం చేయడంతో పాటు టీడీపీ చేసే ఉద్యామాల‌కు ప్రజ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని నిర్ణయించింది… ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లో టీటీడీపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు, భవిష్యత్ ప్రణాళిక త‌దిత‌ర అంశాల‌పై నేతలు సమీక్షించారు. సమావేశానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉద్యమకాలంలో విద్యార్థులను ఆయుధంగా ఉపయోగించుకన్న కేసీఆర్… ఇప్పుడు విద్యార్థుల చదువులు ప్రభుత్వానికి, సమాజానికి భారమన్న అభిప్రాయం వ్యక్తం చేయడం బాధాకరమని చెపుతుండ‌డాన్ని స‌మావేశం త‌ప్పు ప‌ట్టంది. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సాహించడం వ‌ల్ల విద్య ధనికులకే పరిమితమయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మావేశంలో నేత‌లు పేర్కోన్నారు.. ముఖ్య మంత్రి ఈ విష‌యంలో పున‌రాలోచించేవ‌ర‌కూ ఉద్యమాన్ని చేపట్టి కోన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. అటు నిజాం చక్కెర కర్మాగారం తెరిపిస్తానని ఉద్యమ సమయంలో హామీఇచ్చిన కేసీఆర్ నేడు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారు ప్రశ్నించారు. వ్యవ‌సాయ దాని అనుభంద రంగాల‌కు కేటాయించిన నిధులు ఎటు మ‌ళ్లించారో అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌యింద‌ని టీడిపి నేత‌లు మండి ప‌డుతున్నారు. రైతు ప‌క్ష పాతిగా చెప్పుకుంటున్న ముఖ్య మంత్రి ధ‌నిక రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏక కాలంలో ఎందుకు చేయ‌లేక పోతున్నార‌ని నిల‌దీశారు. జీవో 123 పై కేసీఆర్ మేకవన్నె పులిగా వ్య‌వ‌హ‌రింస్తున్నార‌న్న నేత‌లు, అటు ఒపెన్ కాస్ట్ ల తవ్వకాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు లాభాల కోసం వాటికే వంత పాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే సింగరేణి లాభాలబాటలో పయనించిందనే విష‌యాన్ని తెలుసుకోవాల‌ని టీడిపి సీనియ‌ర్ నేత రేవూరి ప్ర‌కాష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ 7.5 లక్షల సభ్యత్వం సాధించింద‌ని.. దాన్ని 8 లక్షల సభ్యత్వంకు చేర్చ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని తెలుగు త‌మ్ముళ్ళు అంటున్నారు. మ‌రోవైపు ఈనెల 23 నుంచి గ్రామకమిటీల నిర్మాణం చేయ‌డంతో పాటు మే 23 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో మినీ మహానాడు సభలు నిర్వహిచ‌డానికి స‌న్నాహ‌కాలు చేస్తున్నమ‌న్నారు. ప్రజల సహకారం, కార్యకర్తల పట్టుదలతో రాష్ట్రంలో టిడిపి ని ముందుకు తీసుకెళ్ళాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు. టీడీపీ క్యాడ‌ర్ బేస్ డ్ పార్టీగా చెపుతున్న టీడీపీ నేత‌లు ఎంత‌మంది పార్టీలు మారినా కోత్త‌వారు పుట్టుకోస్తుటార‌న్నారు. త‌మ‌ది పార్టీల ఫ్యాక్ట‌రీ అని పేర్కోన్న నేత‌ల ఇత‌ర పార్టీల్లో ఉన్న పెద్ద‌నేత‌లు అంద‌రూ తాము త‌యారు చేసిన వారేనంటున్నారు. అవ‌స‌రం మ‌రింత మంది నేత‌ల‌ను త‌యారు చేసుకోగ‌ల స‌త్త త‌మ పార్టీకి ఉందంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *