Home > Crime > ప్రియుడికి గతంలోనే పెళ్లయిందని తెలిసి..

ప్రియుడికి గతంలోనే పెళ్లయిందని తెలిసి..

పాతనేరస్థుడు అరెస్టు
అమ్మదనాన్ని అమ్మకానికి... పెట్టినా శిక్షలు ల్లేవ్

lovers_apduniaఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకమే సన్నగిల్లితే.. నమ్మిన వారిని మోసం చేస్తే.. పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఘోరాలు జరుగుతాయి.. నేరాలు చేసేందుకు పరిస్థితులు పురిగొల్పుతాయి. తాను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియుడికి అంతకుమందే పెళ్లయిందని తెలుసుకున్న ఓ ప్రియురాలు.. కిరాతకంగా మారిపోయి.. దారుణానికి ఒడిగట్టింది. దుబాయిలో ఉండే 35 ఏళ్ల రష్యన్ వ్యాపారస్తురాలు ఓ పాలస్తీనా వ్యక్తిని ప్రేమిచింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని దుబాయి వీధుల్లో విహరించారు. ఈ క్రమంలో ప్రేమికుడికి ఎంతో ఇష్టమని తెలిసి ఓ రెండు కార్లను కొనిచ్చింది. ఇబ్బందుల్లో ఉన్నానని ఎప్పుడూ చెబుతుండటంతో దాదాపు 5 లక్షల దిర్హమ్స్ (3 కోట్ల 21 లక్షల 87వేల రూపాయలు) ఇచ్చింది. తమ బంధం గురించి బయట చెడుగా మాట్లాడుకోవడం గురించి తెలుసుకుని పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన తెచ్చింది. అప్పటిదాకా అన్నీ చక్కగా సాగిపోయిన ప్రియుడికి.. ప్రియురాలి ప్రతిపాదన విని ఉలిక్కి పడ్డాడు. పెళ్లి ప్రస్తావన తన వద్ద తేవద్దని మాట దాటవేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రియురాలు.. అతడి గురించి వివరాలను కూపీ లాగింది. మొత్తానికి అతడికి అంతకుముందే పెళ్లయిందని తెలుసుకుంది. ఈ విషయమై ఓ రోజు తన ఫ్లాట్‌కు వచ్చిన ప్రియుడిని నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవయింది. తాను ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని బెదిరించింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం అయిన తర్వాత కారులో బయటికెళ్లి బార్‌కెళ్లి మద్యం తెచ్చుకున్నారు. ఫ్లాట్‌కు వచ్చి మళ్లీ మందుకొట్టారు. మద్యం మత్తులో ఉన్న ప్రియుడిపై ప్రియురాలు వంటింట్లో వాడే కత్తితో దాడిచేసింది. గుండెల్లో పొడిచి పొడిచి చంపేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న బెడ్‌పై ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారుజామున నిద్రలేచి ఎంచక్కా పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పేసింది. విషయం తెలుసుకున్న దుబాయి పోలీసులు హుటాహుటిన ఆమె చెప్పిన అడ్రస్‌కు చేరుకున్నారు. వారు వచ్చేసరికి ప్రియుడి శవం దగ్గరే కత్తి పట్టుకుని కూర్చుందామె. ఆమెను కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *