Home > World News > International > ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య సూపర్ అన్న ట్రంప్

ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య సూపర్ అన్న ట్రంప్

ట్రంప్‌, పుతిన్ ర‌హ‌స్య భేటి
పదేళ్ళనాటి వీడియోతో హీటెక్కించిన ట్రంప్

trump comments_apduniaఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తోటి దేశాధ్యక్షుడి భార్యను మోతాదుకు మించి పొగడడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గురువారం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ దంపతులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ దంపతులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ ప్రధమ మహిళ బ్రిగెట్టే మేక్రాన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్, సంప్రదాయపూర్వకంగా ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మాటల్లో పడ్డారు. అంతవరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత ట్రంప్ అన్న మాటలే వివాదానికి కారణమయ్యాయి. భార్య మెలానియా పక్కన నిలబడిన ఆమెను ట్రంప్ పొగుడుతూ.. ‘‘నీ రూపం చాలా బాగుంది. ఈమె శరీర సౌష్టవం అద్భుతం. చాలా అందంగా ఉంది..’’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలు పరోక్ష లైంగిక వేధింపుల మాదిరిగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోసినట్టు ‘ది గార్డియన్’ పేర్కొంది. ఫ్రీలాన్స్ ప్రొడ్యూసర్, లింగవివక్షలపై కలం రుళిపించే రచయిత అలెక్స్ బెర్గ్ టిటర్లో ఘాటుగా స్పందించారు. ‘‘కాంప్లిమెంట్ పేరిట పురుషులు ఎలా లైంగిక వేధింపుకు పాల్పడతారో ట్రంప్ వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి..’’ అని ఆమె పేర్కొన్నారు. డాక్యుమెంటరీ మేకర్, నటి జెన్ సైబల్ న్యూసమ్ స్పందిస్తూ.. ‘‘మిస్టర్ ట్రంప్… మీరనుకుంటున్నట్టుగా మహిళలు తమ శరీరాన్ని గురించి ఆయాచిత వ్యాఖ్యలను వినేందుకు ఇష్టపడరు…’’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిచేందుకు వైట్‌హౌస్ అధికారులు నిరాకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *