Home > Vanitha > Beauty > బాడీ లోషన్‌ వల్ల ఉపయోగాలు..!

బాడీ లోషన్‌ వల్ల ఉపయోగాలు..!

ఆరోగ్యకరమైన జుట్టుకు కొబ్బరి నూనె-నిమ్మరసం
పెరుగుతో కురుల సౌందర్యం మీ సొంతం...!

Calamine-Lotion-apduniaచర్మంలో తేమని నిలిపి ఉంచడానికి ఏదోఒకక్రీమ్‌/ లోషన్‌ రాసుకుంటే సరిపోతుందనుకుంటే పొరపాటు. వీటిలో కూడా మీకు నప్పే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి. అలాగే వాటిని ఉపయోగించే విధానాన్ని కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం.

కాస్తతడిగా ఉన్నప్పుడే..
ముఖానికి లేదా చర్మానికి క్రీమ్‌లు, లోషన్లు.. మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అప్పుడు అది చర్మగ్రంథులకు చేరే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం ఎంతోకొంత తడిగా ఉన్నప్పుడే వాటిని రాసుకోవాలి. అలా చేయడం వల్ల క్రీమ్‌ లేదా లోషన్‌ ఆతడి ద్వారా చర్మగ్రంథులకు అందుతుంది. ఫలితంగా ఆశించిన ఫలితం లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు క్రీమ్‌ లేదా లోషన్స్‌ రాయడం వల్ల అవి చర్మంలోకి సరిగా ఇంకవు. ఫలితంగా డబ్బు, క్రీమ్‌.. రెండూ వృథానే.

స్నానం చేసిన వెంటనే..
క్రీమ్‌ లేదా బాడీ లోషన్స్‌ రాసుకోవడానికి సరైన సమయం స్నానం చేసిన వెంటనే. ఎందుకంటే అప్పుడే చర్మం తాజాగా, శుభ్రంగాఉంటుంది. చర్మకణాలన్నీ తెరుచుకుని ఉంటాయి కాబట్టి ఆసమయంలో క్రీమ్‌ లేదా లోషన్స్‌ రాయడం వల్ల అవి చర్మగ్రంథుల్లోకి సులభంగా ఇంకుతాయి. అలాగే స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకొట్టిన తర్వాత కూడా తప్పకుండా క్రీమ్‌ లేదా బాడీలోషన్‌ రాసుకోవాలి. లేదంటే నీటిలో ఉండే క్లోరిన్‌ వల్ల చర్మం మరింత పొడిగా మారిపోయి కళ తప్పిపోతుంది.

మృదువుగా రాసుకోవాలి..
చర్మానికి క్రీమ్‌ లేదా బాడీలోషన్‌ రాసుకోవడానికి కూడాఒక పద్ధతుంది. ముందుగా కొద్దిగా క్రీమ్‌ని చేతిలో కితీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే రాసుకోవాలనుకుంటున్నామో అక్కడ చిన్న చిన్న డాట్స్‌ లాపెట్టాలి. సర్క్యులర్‌గా రుద్దుతూ డాట్స్‌ ని కలుపు కుంటూ మొత్తం ఆప్రాంతమంతా మృదువుగా రాసుకోవాలి. అప్పుడే చర్మం మరింత నిగారింపుని సొంతం చేసుకుంటుంది. గట్టిగాఅదుముతూ, చర్మం మీద ఒత్తిడి కలిగించి రాసేక్రీమ్స్‌ లేదాలోషన్స్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. పైగా చర్మం కమిలి పోవడం, లూజ్‌గా అయిపోవడానికి అవకాశాలెక్కువ ఉంటాయి.

చర్మం కాస్త వేడిగా..
చర్మంమరీ చల్లగా ఉన్నప్పుడు క్రీమ్స్‌ రాసుకోకూడదు. ఒకవేళ రాసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. చర్మం ఎంతోకొంత వేడిగా ఉన్నప్పుడే క్రీమ్‌లేదాలోషన్స్‌ చర్మంలోకి సులభంగా ఇంకిపోయి, వాటి పనితనాన్ని చూపించగలుగుతాయి. క్రీమ్‌ లేదా లోషన్‌ రాసుకునే ముందు ఎప్పుడన్నా చర్మంచల్లగా అనిపిస్తేవెంటనే గోరువెచ్చనినీళ్లలో ముంచినటవల్‌తో ముఖం తుడుచుకోవాలి. చర్మం తడిపొడిగా ఉన్నప్పుడేక్రీమ్‌ లేదాలోషన్‌ చర్మానికి అప్త్లెచేసుకోవాలి.

ఎన్నోప్రయోజనాలు..

పొడిబారి నిర్జీవంగా మారిపోయిన చర్మానికిక్రీమ్‌ లేదా లోషన్‌ రాసుకోవడం వల్ల తిరిగి జీవం పోసుకుంటుంది. తాజాదనాన్నిసంతరించుకుంటుంది.
చర్మం మీద ఎప్పట్నుంచో ఉన్న మచ్చల్ని కూడా మెల్లగా తగ్గించడానికి ఉపయోగపడతాయి.
చర్మానికి రాసుకునే క్రీమ్‌లేదా బాడీలోషన్స్‌ లో ఉండే సువాసన వల్లచాలా హాయిగా అనిపిస్తుంది. ఒకచక్కటిఅనుభూతికూడాకలుగుతుంది.
అంత తొందరగా అలసటను దరిచేర నీయదు. పైగాక్రీమ్‌ నుంచి వచ్చే సువాసన ద్వారా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
అంతేకాదు..గట్టిగా, రఫ్‌గా ఉండే భాగాలపైనకూడా తరచుగాక్రీమ్‌ లేదాలోషన్స్‌ అప్త్లె చేయడం వల్ల స్మూత్‌గా మారి మెత్త బడతాయి.
ఇక అన్నిటి కంటే ముఖ్యంగా చర్మంలోని తేమని నిలిపి ఉంచి, చర్మకాంతిని మరింత ఇనుమడించేలా చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *