Home > Politics > బాలల హక్కులపై అవగాహన : ఎంపీ బండారు దత్తాత్రేయ

బాలల హక్కులపై అవగాహన : ఎంపీ బండారు దత్తాత్రేయ

అన్నివర్గాల ప్రజలకు ఇబ్బందులు : వై ఎస్ జగన్
రేవంత్ పైన కవిత పోటీ

bandaru-dattatreya-apduniaపిల్లలు దేవుని తో సమాధానం. బాలల హక్కుల పై గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం నాడు రవీంద్రభారతి లో మహిళ శిశు సంక్షేమ శాఖా ఆధ్వర్యం లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మహిళా కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి ఇతరులు పాల్గోన్నారు. పిల్లల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషముగా ఉందని దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో అన్ని అంగన్ వాడి కేంద్రాలు మంచి గా పౌష్టికాహారం అందిస్తున్నవన్నారు. ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ అంగన్ వాడి కేంద్రాలు కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అయన అన్నారు. కేంద్రప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని అదుకుంటుందన్నారు. దరూ చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని దత్తాత్రేయ అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భావి భారత పౌరులైన బాలల సంరక్షణ కి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బాల బాలికలను మంచిగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. భవిష్యత్ తెలంగాణ చూసుకోవాలి అంటే బాలల కోసం అనేక పధకాలు తెస్తున్నామని అన్నారు. రాష్ట్ర కేంద్ర నిధుల తో …ప్రభుత్వం తరుపునా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. బాల అమృతం తో పాటు,పాలు, గుడ్డు ఇస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *