Home > Tirumala News > బ్యాంక్ లో స్వామి వారి బంగారం 2,780 కిలోలు

బ్యాంక్ లో స్వామి వారి బంగారం 2,780 కిలోలు

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
భద్రత కరువు

ttdప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో 2.5 శాతం వడ్డీకి 2,780 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన 12 సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం  డిపాజిట్ చేసింది.  ఎస్‌బిఐ అధికారులు ఈ మేరకు డిపాజిట్ పత్రాలను స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి ఎఫ్‌ఏఅండ్‌సిఏఓ ఓ బాలాజీకి అందించారు. టిటిడి బంగారాన్ని తమ బ్యాంకులో డిపాజిట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇదేవిధమైన సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్‌మానిటైజేషన్  పథకం ప్రకారం ఫిబ్రవరిలో టిటిడి స్వల్పకాలిక డిపాజిట్లన్నింటినీ దీర్ఘకాలిక డిపాజిట్లుగా మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే స్వల్పకాలిక డిపాజిట్లుగా ఉన్న 2,075 కిలోల బంగారాన్ని  దీర్ఘకాలిక డిపాజిట్లుగా ఎస్‌బిఐలో పెట్టింది. దీంతోపాటు మరో 705 కిలోల బంగారాన్ని కూడా డిపాజిట్ చేసింది. ముంబయ మింట్‌కు టిటిడి బంగారు నగలను పంపించగా, వాటిని కరిగించి శుద్ధి చేసిన అనంతరం 705 కిలోల స్వచ్ఛమైన బంగారం వచ్చింది. ఈ బంగారాన్ని కూడా ఎస్‌బిఐలోనే ఇప్పుడు టిటిడి డిపాజిట్ చేసింది. దీంతో మొత్తం 2,780 కిలోల బంగారాన్ని ప్రస్తుతం టిటిడి ఎస్‌బిఐలో దీర్ఘకాలిక పథకంలో డిపాజిట్ చేసినట్లైంది. 

Tags: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *