Home > Movies > బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

కొత్త గెటప్‌లో ఇలియానా
కేటీ పెర్రికి 10 కోట్ల మంది ఫాలోయిర్స్

bramhanandam_apduniaతెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా హాస్యనటుడిగా వెలుగొందుతున్న నటుడు బ్రహ్మానందం. ఈయన ఆస్తులపై జాతీయ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. బ్రహ్మానందానికి ఆస్తులు రూ.320 కోట్ల వరకు ఉన్నాయంటూ ఆ ప్రచార సారాంశం. ఈ ఆస్తుల్లో విలువైన కార్లు, హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా, కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ భూమి ఉన్నట్టు పేర్కొంది. కాగా, బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన వార్తలు స్థానిక మీడియా సహా జాతీయ మీడియా సంస్థల్లో హల్ చల్ చేశాయి. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలిన బ్రహ్మానందం సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. కొత్తతరం హాస్య నటుల రాకతో బ్రహ్మానందం హవా బాగా తగ్గింది. ముఖ్యంగా ఇటీవలికాలంలో ఆయనకు అవకాశాలు చాలా మేరకు సన్నగిల్లిపోయాయి. ఇపుడు విడుదలయ్యే తెలుగు చిత్రాల్లో బ్రహ్మానందం పెద్దగా కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *