Home > General > భారత్ అమ్ములపొదిలో కల్వరి

భారత్ అమ్ములపొదిలో కల్వరి

ఇంటర్నెట్ లో వైరల్‌ అవుతున్న ఏనుగుల ఫోటో
టాప్ ట్రెండింగ్ లో మెర్సల్ మూవీ టీజర్

kalvari-apduniaముంబయిలోని మజగావ్ డాక్స్ వద్ద ‘ప్రాజెక్టు 75’ వెంచర్ పేరుతో కల్వరి సబ్‌మెరైన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దాదాపు రూ.350 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద ఫ్రాన్స్‌కి చెందిన డిసిఎన్‌ఎస్ కంపెనీతో కలిసి భారత నావీ మొత్తం ఆరు సబ్‌మెరైన్లను తయారు చేయనుంది. ఇందులో భాగంగా మొదటి సబ్‌మెరైన్ కల్వరి తయారీ మే 23, 2009న మొదలై అనుకున్న సమయం కంటే ముందే పూర్తవడం విశేషం. కల్వరి సబ్‌మెరైన్‌కు చెప్పుకోదగ్గ విశిష్టతలు ఉన్నాయి. ఇది సముద్రగర్భంలో 18 టార్పిడోలను మోసుకుని 1,020 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 66 మీటర్ల పొడవైన ఈ సబ్‌మెరైన్ శత్రు దేశాల సబ్‌మెరైన్ల దృష్టిని మరల్చుతూ సుమారు 300 మీటర్ల లోతులో చాకచక్యంగా ప్రయాణించగలదు. అంతేకాక జిత్తులమారితనంతో తప్పించుకుంటూ నిర్దేశిత ఆయుధాలతో ప్రత్యర్థి సబ్‌మెరైన్లపై కచ్చితత్వంతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. ఈ దాడి టార్పిడోతోనూ అదే విధంగా సముద్రగర్భం లేదా సముద్ర ఉపరితలం నుండి గొట్టం ద్వారా ఓడల నిరోధక క్షిపణులతోనూ జరుగుతుంది. అంతేకాక ఈ సబ్‌మెరైన్‌ను ఉష్ణమండల ప్రదేశాలతో పాటు అన్ని రణక్షేత్రాల్లోనూ పోరాడేలా తయారు చేశారు. సముద్ర ఉపరితల ఓడలను ధ్వంసం చేయడం, జలాంతర్గాములను ధ్వంసం చేయడం, నిఘా సమాచార సేకరణ, పేలుడు ఖనిజాలను మోహరించడం, ప్రదేశ నిఘా లాంటి కార్యకలాపాలను నిర్వర్తించడం కల్వరికున్న సమర్థతలుగా చెప్పుకోవచ్చు. అంతేకాక దీనిని అధిక ఒత్తిడిని, పీడనాన్ని తట్టుకునే విధంగా ఉక్కుతో తయారు చేశారు. ఈ విశిష్టత వల్ల ఇది శత్రుదేశాల సబ్‌మెరైన్ల కంటపడకుండా నీటి లోపల తన టక్కరితనాన్ని దూకుడుగా ప్రదర్శిస్తూ నీరు లేదా జలస్థితిక పీడనం ద్వారా ఎదురయ్యే పోటును తట్టుకోగలుగుతుం ది. సముద్రంపై సులభంగా తిరిగి లోడ్ చేయగలిగే ఆయు ధాలను ఇది మోసుకెళ్లగలదు. భారతదేశ పురాణాలను, నావికా దళ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, డిసెంబరు 8, 19 67 న భార త నావీకి అ ప్పగించిన మొట్టమొదటి సబ్‌మెరైన్‌కి కల్వరిని మరో అవతారంగా అభివర్ణించవచ్చు. అంతకు ముందు కల్వరి దాదాపు మూడు దశాబ్దా ల పాటు దేశానికి సేవలందించింది. మే, 1996లో అది నిష్క్రమించింది. వాస్తవికమైన నాటికల్ సంప్రదాయంలో చెప్పాలం టే, మజగావ్ డాక్ ద్వారా కల్వరి నేడు మ రో అవతారమెత్తింది. కచ్చితంగా ఇది మరోసారి మన దేశ సముద్రగర్భ, విస్తృతమైన సముద్రసంబంధి ప్రయోజనాలను కాపాడే ఒక శక్తివంతమైన పోరాటకిగా అవతరించిందని ఘంటాపథంగా చెప్పగలమని నేవీ ప్రకటనలో తెలిపింది.కల్వరి తర్వాత స్కార్పీన్ శ్రేణిలో రెండో సబ్‌మెరైన్ ‘ఖందేరి’. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దీని నిర్మాణం ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ప్రస్తుతం ఇది సముద్ర ట్రయళ్లను జరుపుకుంటోంది. మూడో సబ్‌మెరైన్ ‘కరంజ్’. ఈ ఏడాది ఆఖర్లో దీనిని వినియోగంలోకి తీసుకురానున్నారు. మిగిలిన సబ్‌మెరైన్‌లు 2020 కల్లా నేవీ చేతికి అందుతాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *