Home > Crime > భార్యను కళ్లు మూసుకొమ్మని…

భార్యను కళ్లు మూసుకొమ్మని…

భార్య, బిడ్డలకు విషాహారం తినిపించి..
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. టీవీ నటి, మేకప్ మేన్ అరెస్ట్

murder_apduniaఅప్పటికే వారిద్దరి మధ్య పెద్ద గొడవ. తీవ్ర కోపంతో భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఫైటింగ్‌కు స్వస్తి పలకాలని, ఆ గొడవ మర్చిపోయేందుకు ఆమెకు గొప్ప బహుమతి ఇస్తానని నమ్మబలికాడు. పార్క్‌కు పిలిపించాడు. ఇద్దరు కలుసుకున్నాక కొద్ది సేపు కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకొని తనవైపునకు తిప్పుకొంటూ ఆమెను ఆశ్చర్యపరచబోతున్నానని, కళ్లు మూసుకోవాలని చెప్పాడు. దాంతో తన భర్త నెక్లెస్‌ తీసుకొచ్చాడని ఆమె సంతోషపడింది. ఆమె అలా కళ్లు మూసుకుందో లేదో వెంటనే ఓ వైరును తీసుకొని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఢిల్లీలోని మనోజ్‌ కుమార్‌ కోమల్‌ అనే యువతిని రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ వివాహం. రెండేళ్లలోనే వారిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. కోమల్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ మనోజ్‌కుమార్‌ ఎప్పటి నుంచో అనుమానిస్తున్నాడు. అదే విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవవుతోంది. ఈ క్రమంలో వారిద్దరు కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *