Home > Crime > భార్య, బిడ్డలకు విషాహారం తినిపించి..

భార్య, బిడ్డలకు విషాహారం తినిపించి..

అమ్మదనాన్ని అమ్మకానికి... పెట్టినా శిక్షలు ల్లేవ్
భార్యను కళ్లు మూసుకొమ్మని...

suicide attempt_apduniaవిజయవాడ కృష్ణలంకలోని రణదివే నగర్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వ్యక్తి భార్యా పిల్లలకు విషాహారం తినిపించి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. విషాహారం తిన్న వెంటనే భార్యాభర్తలు, కుమారుడు మృతిచెందగా తక్కువ మోతాదులో తిన్నందున వారి ఇద్దరు కుమార్తెలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సురేశ్‌ ఇల్లరికం వచ్చి విజయవాడలోని కృష్ణలంక రణదివే నగర్‌లో నివాసముంటున్నాడు. శనివారం కుమారుడు హరిచరణ్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులకు మిఠాయిలు పంచారు. అనంతరం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో వివాదం చోటుచేసుకుంది. మనస్తాపానికి గురైన సురేశ్‌ తానే స్వయంగా వంటకాన్ని తయారుచేసి దానిలో విషం కలిపి భార్యా పిల్లలకు తినిపించి తానూ తిన్నాడు. భార్యభర్తలు, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారి ఇద్దరు కుమార్తెలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *