Home > Movies > మంచు విష్ణుకు మోహన్ బాబు వార్నింగ్

మంచు విష్ణుకు మోహన్ బాబు వార్నింగ్

అనాథ పిల్లలతో ఆడిపాడిన "అందాల రాక్షసి"
క్రిష్... ఎంతో కష్టపడ్డారు

mohan-babu-right-vishnu-manchu-rowdy_apduniaమోహన్ బాబు ఎంత విలక్షణ నటుడో వ్యక్తిత్వ పరంగా అంత ఓపెన్ అనే సంగతి తెలిసిందే. అది ఎవరి గురించి అయినా సంకోచించరు. తన బిడ్డ విష్ణు చాలా సిన్సియర్ అని అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందన్న ఆయన ఓ విషయంలో కొడుకు విషయంలో తనకు కలిగిన నిరుత్సాహాన్ని స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పారు. ఈ మధ్యనే టీవీల్లో చూశాను. ‘నేను సహజంగా నా ఆడియోకి కూడా వెళ్లను’ అని ఎక్కడో ఫంక్షన్ లో అన్నావు. అది తప్పు. నీ ఆడియో ఫంక్షన్ కి నువ్వు వెళ్లాలి. పదిమంది హీరోలు నిన్ను ప్రేమగా పిలిచినపుడు వారి ఆడియో ఫంక్షన్ కి వెళ్లాలి. అంతేకానీ నా ఆడియో ఫంక్షన్ కూడా నేను వెళ్లను అని కొంతమంది హీరోల్లాగా డబ్బాలు కొట్టుకోవద్దు. అర్థమైందా.. బీ సిన్సియర్.. సిన్సియర్ గా ఉన్నపుడే అన్నీ ఉంటాయ్ మనకి.. డబ్బాలు వద్దు మనకు” అంటూ కొడుకు విష్ణుకు సున్నితంగానే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మోహన్ బాబు. లక్కున్నోడు ఆడియో విడుదల వేడుకలో ఈ ఘటన జరగగా సినిమా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *