Home > Editorial > మహానందీశ్వరా…..భూములకు దార్లు వెతుకుతున్నారు…

మహానందీశ్వరా…..భూములకు దార్లు వెతుకుతున్నారు…

ఉమ్మడి అజెండాతో వాయిస్ పెంచుతున్న ప్రతిపక్షాలు
ఆర్థికవృద్ధి దిశగా అడుగులు

mahanandi-temple-apduniaకర్నూలుజిల్లాలోని మహానందీశ్వరుడికి వందకుపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ ఆలయ భూములు స్వాధీనం అయితే మహానందీశ్వరుడు వందకోట్లతో కోటీశ్వరుడు అయిపోతాడు. గతంలో నుండి స్వామి వారి భూములకు సంబంధించిన రికార్డులను విస్మరించిన ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు మహానందీశ్వరస్వామి వారి ఆలయం భక్తుల అభిమానాన్ని, పర్యాటకుల ప్రేమాభిమానాలను పంచుకుంటున్నప్పటికి నిధుల లేమి కారణంగా అభివృద్ధికి నోచుకోలేదు. మహానంది ప్రాంతంలోని పూర్వీకులు, దేవస్థానంలో మొదటి నుంచి పనిచేస్తున్న వారిచ్చిన సమాచారం మేరకు రికార్డులను పరిశీలించి చూడగా నేడు 106.55 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తుందే తప్ప ఆ భూమి ఎక్కడ ఉంది, ఎవరి చేతిలో అన్యాక్రాంతానికి గురైందో తెలియని పరిస్థితి నెలకొంది. దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు చొరవ తీసుకొని ఆలయ భూములు అన్యాక్రాంతమైన విషయాలను పూర్తిస్థాయిలో జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపడంతో కలెక్టర్ స్పందించి మహానంది ఆలయ భూముల సర్వే కోసం ప్రత్యేక బృందాన్ని నియమించాలని ఆదేశించారు గతంలో స్వామి వారి భక్తులు ఇచ్చిన 106.55 ఎకరాల భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. స్వామి వారి భూములు ఏ గ్రామంలో ఉన్నాయో ఆ గ్రామానికి సంబంధించిన విఆర్‌ఓ, సర్వేయర్, ఆలయానికి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సర్వే చేసి గుర్తించారు. నంద్యాల పట్టణంలో భాగమైన మూలసాగరం సర్వే నెంబరులో సుమారు 30 ఎకరాల నాణ్యమైన సాగుభూమి ఉన్నట్లు సర్వే బృందాలుగుర్తించాయి. ఈ భూములు ఎస్‌ఆర్‌బిసి కాల్వ ద్వారా సాగునీరు అందుతున్నట్లు వారు గుర్తించారు. ఈ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో నిగ్గుతేల్చాల్సిన పనిలో పడ్డారు అధికారులు. అలాగే నంద్యాల మండలంలోని కొత్తపల్లె గ్రామంలో సగభాగం గ్రామం ఆలయ భూముల్లోనే ఉన్నట్లు సర్వే బృందం గుర్తించింది. నంద్యాల పట్టణ నడిబొడ్డులోని ఎస్‌బిఐ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న ఆలయ భూమి కూడా చాలా ఖరీదైన భూమిగా, ఇంటి స్థలాలకు పనికి వచ్చే భూములుగా గుర్తించారు. అదేవిధంగా మహానంది మండలంలోని తమడపల్లె గ్రామంలో కూడా కోట్ల రూపాయలు విలువ చేసే సాగు భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మహానందీశ్వర స్వామి వారి ఆలయ భూములు స్వాధీనం చేసుకుంటే సుమారు రూ.100 కోట్లు విలువ చేసే 106.55 ఎకరాల భూమి స్వామి వారికి దక్కుతుంది. దీంతో ఆలయ భూములపై వచ్చే ఆదాయం వెలకట్టి స్వామి వారి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులు చేయడానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఈనిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతోపాటు మహానందీశ్వర స్వామి వారి ఆలయం ఏగ్రేడ్ ఆలయం కింద పరిగణించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇంతకాలం మరుగున పడిన మహానందీశ్వర స్వామి వారి ఆలయ భూముల సర్వే సక్రమంగా జరిగి ఆ భూములు స్వామి వారికి స్వాధీనం అయితే మహానందీశ్వరుడు కూడా కోటీశ్వరుడే అని భక్తులు అనుకుంటున్నారు.

మహానందీశ్వరుడి ఆస్తులు..
మహానందీశ్వరస్వామి ఆలయానికి సంబంధించి భూముల వివరాలను ఇఓ డా.శంకర్‌వరప్రసాద్ తెలిపారు. నంద్యాల డివిజన్ నంద్యాల మండలంలో 487 సర్వే నంబర్‌లో 8.44 ఎకరాలు, 562 సర్వే నంబర్‌లో 5.96,974 సర్వేలో 5.68, 1.44, 1124 సర్వేలో 5.46, 1308 సర్వేలో 10.8, 1309లో 76 సెంట్లు, 1310/1లో 10.32 ఎకరాలు, 1310/2లో 3.08 ఎకరాలు, 1330లో 71 సెంట్లు, 1402లో 6.07 ఎకరాలు, అదే మండలంలోని కొత్తపల్లి మండలంలో 1434లో 2.6 ఎకరాలు, 1438లో 2.47, నంద్యాలలో 2006 సర్వే నంబర్‌లో 2155లో 1.27 ఎకరా, 2214లో 6సెంట్లు, 2269లో 24సెంట్లు, 2345లో 11.29 ఎకరాలు, మహానంది మండలంలోని తమడపల్లిలో 303 సర్వేలో 8.74 ఎకరాలు, 314లో 9.47 ఎకరాలు, 310లో 11.16 ఎకరాలు కలపి మొత్తం 108 ఎకరాల 5సెంట్లు అన్యాక్రాంతానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *