Home > Movies > మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2

మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2

ఎన్టీఆర్ తో ఢీ అంటున్న నారావారబ్బాయి
అత్తపాత్రలో మరో సీనియర్ నటి

bahubali2_apduniaభారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన, నేటికీ సాగిస్తున్న బాహుబలి 2 విడుదలై నేటికి 50 రోజులు. రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగెస్ట్ ఇండియన్ ఫిలింగా అవతరించింది బాహుబలి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో సుప్రసిద్ధ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి స్పందన వచ్చింది. రొమేనియా ఫిలిం ఫెస్టివల్లో అయితే తెలుగు వెర్షన్‌ను ఇంగ్లీష్ టైటిల్స్‌లో చూస్తూ జనం కొట్టిన కేరింతలు మర్చిపోలేము. మాస్కోలోనే బాహుబలికి అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటివరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్‌కి ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం జాతీయ ముద్రను పొంది తెలుగు రాష్ట్రాలకంటే హిందీ ప్రాంతంలోనే కలెక్షన్ల వరదను సృష్టించిన చరిత్ర ఇప్పటికైతే బాహుబలి 2కే దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో గత 50 రోజుల్లో 198 కోట్లు సాధించిన బాహుబలి2 అనితర సాధ్యం అనిపించుకోగా, హిందీ వెర్షన్ నేటికి 510 కోట్ల రూపాయలతో సాగుతోంది. ఈ రోజుకీ బాహుబలి2 ఉత్తరాదిలో రోజుకు కోటి రూపాయల కలెక్షన్ ఆర్జిస్తోందంటే నమ్మశక్యంగా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *