Home > Vanitha > Beauty > మీ వక్షోజాలు సాగుతుంటే ఇలా చేయండి

మీ వక్షోజాలు సాగుతుంటే ఇలా చేయండి

చలికాలంలో చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే...
జుట్టుకు దివ్య ఔషధం జామ ఆకులు

breast-massage_apduniaవయసుతో సంబంధం లేకుండా వక్షోజాలు సాగిపోతుండడంతో మహిళలు చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. మందులు, సర్జరీలు లేకుండా ఇంటి చిట్కాలతోనే వక్షోజాలను నేచురల్‌గా ఉంచుకోవచ్చని న్యూజిలాండ్‌ యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు. వక్షోజాలు కొవ్వుతో తయారవుతాయి. కణజాలాలు, పాల ఉత్పత్తి గ్రంధులతో కలిసి ఉంటాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే సాగిపోయి షేప్‌ లెస్‌ గా తయారవుతాయి. దాన్ని నివారించాలంటే ఇలా చేయాలంటున్నారు వైద్యులు.

మసాజ్
వారానికి రెండుమూడు సార్లు వక్షోజాలను ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయాలి. తద్వారా స్కిన్‌ టోన్‌, స్ట్రక్చర్ ఇంప్రూవ్‌ అవుతుంది. అంతేగాక చర్మం సాగేతత్వాన్ని కంట్రోల్లో ఉంచుతుంది.

ముఖ్యమైన ఆయిల్స్‌
క్యారెట్‌ ఆయిల్‌, సైప్రస్‌ ఆయిల్, సోపు ఆయిల్‌, లెమన్‌ గ్రాస్‌ ఆయిల్, లేత ఆకుపచ్చరంగు ఆయిల్స్‌ ను వెజిటబుల్ ఆయిల్స్‌ తో కలిపి మసాజ్ చేసుకున్నట్లైతే వక్షోజాలు సాగకుండా నిలకడగా ఉంటాయి.

మాస్క్
వారానికి ఒకసారి తప్పనిసరిగా రొమ్ము మాస్క్‌ను వేసుకున్నట్లైతే రొమ్ములు ధృడంగా ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవటం కూడా సులభమే. కీరదోసను గ్రైండ్ చేసి దాంట్లో గుడ్డు, వెన్న, లేదంటే నేచురల్‌ క్రీమ్‌ను కలపాలి. ఆ మిశ్రమాన్ని పేస్ల్‌ లాగా చేసుకొని వక్షోజాలకు పట్టించాలి. దాదాపు ఓ అరగంట పాటు ఉంచి ఆ తర్వాత నీటితో కడిగేసుకోవాలి.

దానిమ్మ పేస్ట్
దానిమ్మ వృద్ధాప్యాన్ని దూరం చేసే పండు. ముఖ్యంగా సాగిపోతున్న వక్షోజాలకు ఇది మంచి ఔషధం. దానిమ్మ తొక్కులను ఆవ నూనెలో వేడి చేయాలి. ఆ ఆయిల్‌‌ ను పడుకునే ముందు వక్షోజాలకు పట్టించాలి. గుండ్రంగా చేతిని వక్షోజంపై 10 నిమిషాలు మసాజ్‌ చేయాలి. ఇలా రోజుకు 2-3సార్లు చేసుకోవటం వల్ల వక్షోజాలు సాగడం తగ్గుతాయని చెప్తున్నారు నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *